మాల్దీవుల్లో భారత సైన్యం ఉపసంహరణకు సంబంధించి ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. మాల్దీవుల్లో భారత వాయుసేన కార్యకలాపాలు కొనసాగేలా పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం ప్రయత్నించేందుకు అంగీకరించాయి. మూడు వాయుస్థావరాల్లో భారత సైనిక బలగాల స్థానంలో పౌర సిబ్బందిని నియమించేందుకు భారత్ అంగీకరించిందని మాల్దీవుల విదేశాంగ శాఖ ప్రకటించింది. మే 10లోపు సైనిక సిబ్బందిని వెనక్కు పిలిపించుకునేందుకు భారత్ అంగీకరించినట్టు తెలిపింది. మాల్దీవులతో పలు అంశాలపై చర్చ జరిగిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం, సహకారం పెంపొందించే చర్యలు చేపట్టేందుకు అంగీకరించినట్టు పేర్కొంది. ఈ దిశగా చేపట్టిన ప్రాజెక్టులు త్వరిత గతిన పూర్తి చేస్తామని వెల్లడించింది. ప్రస్తుతం మాల్దీవుల్లో 80 మంది భారత సైనిక సిబ్బంది ఉన్నారు. అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు, ఒక సైనిక విమానం సాయంతో గత కొన్నేళ్లుగా పలు మానవతా మిషన్లు, ఇతర అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే, ఇటీవల భారత్ సైన్యాలను ఉపసంహరించుకోవాలన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు చైనా సైనిక నావను కూడా తమ పోర్టులో ఆగేందుకు అనుమతించారు. Read Also..
ఓ అంగీకారానికి వచ్చిన ఇరు దేశాలు..
54
previous post