Table of Contents
జంక్ ఫుడ్ రుచికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అంతలా వ్యసనపరుస్తుంది జంక్ ఫుడ్ మనందరిని. ఒక్కసారి తినడం మొదలుపెడితే ఆపడం కష్టం. కానీ జంక్ ఫుడ్ మీ ఆరోగ్యానికి ఎంత హానికరమో మీకు తెలుసా? ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే కొన్ని ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అసలు జంక్ ఫుడ్ (Junk Food) అంటే ఏంటి?
జంక్ ఫుడ్ లో ఉప్పు, షుగర్, కొవ్వు చాలా అధికంగా ఉంటాయి మరియు పోషక విలువలు(Nutritional values) చాలా తక్కువ ఉంటాయి. జంక్ ఫుడ్ లో చాలా తక్కువ పీచు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జంక్ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రమాదాలు..
జంక్ ఫుడ్ లో ఎక్కువగా ఉండే కేలరీలు ఊబకాయానికి దారి తీస్తాయి. జంక్ ఫుడ్ లో ఎక్కువగా ఉండే కొవ్వు(Fat) గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. జంక్ ఫుడ్ లో ఎక్కువగా ఉండే చక్కెర మధుమేహానికి దారి తీస్తుంది. జంక్ ఫుడ్ లో ఉండే కొన్ని రసాయనాలు క్యాన్సర్ కి కారణం కావచ్చు. జంక్ ఫుడ్ తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జంక్ ఫుడ్ వాల్ల చాలానే అనార్ధాలు ఉన్నాయి.
జంక్ ఫుడ్ ని మానుకోవటం ఎలా..?
ఆరోగ్యకరమైన ఆహారం తినండి, పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్ వంటి ఆరోగ్యకరమైన ఆహారం తినండి. జంక్ ఫుడ్ ను ఇంట్లో ఉంచుకోవద్దు, జంక్ ఫుడ్ ను ఇంట్లో ఉంచుకోకపోతే మీరు దానిని తినే అవకాశం తక్కువ గా ఉంటుంది. మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి, ఒత్తిడి, ఆందోళన వంటి భావోద్వేగాలకు లోనైనప్పుడు జంక్ ఫుడ్ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ భావోద్వేగాల్ని కంట్రోల్ చేయండి. మీకు నచ్చిన వ్యాయామం చేయండి ఇలా వ్యాయామం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండడంతో పాటు జంక్ ఫుడ్ తినాలనే కోరికను తగ్గిస్తుంది.
జంక్ ఫుడ్ మీ ఆరోగ్యానికి హానికరం. మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే జంక్ ఫుడ్ తినడం ఈరోజే మానుకోండి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి