తీవ్రమైన కరువు దృష్ట్యా పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రజలు త్రాగడానికి నీరు కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే దాచేపల్లి నగర పంచాయతీ మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ మునగా రమాదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నీళ్ళ ట్యాంకర్ ని ఏర్పాటు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
నీటి ట్యాంకర్ ని గురజాల(dachepalli) శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి(Kasu Mahesh Reddy) మాట్లాడుతూ మనగా రమాదేవి గారు దాచేపల్లి నగర పంచాయతీకి మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టి , ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేశారని , వారి అకాల మరణాన్ని మేము ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నామని వారు గుర్తుచెసారు. రమాదేవి గారి పేరిట ఇలాంటి నీటి ట్యాంకర్ ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీర్చడం , ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పున్నారావు గారిని ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అభినందించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి