Health Tips
బాదం జ్యూస్(Almond juice)..
శరీరం డిహైడ్రేషన్(Dehydration) సమస్య బారిన పడకుండా ఉండడానికి ప్రతి రోజు బాదం జ్యూస్(Badam jyas)ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్ల ఎంతో ఎండల్లోనైన శరీరం ఆరోగ్యం ఉంటుంది. ఎండల కారణంగా చాలా మంది డిహైడ్రేషన్ సమస్యల బారిన పడుతూ ఉంటారు. రోగనిరోధక శక్తి(Immunity) కూడా సులభంగా తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఇలాంటి సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
బాదం జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు..
- బాదం జ్యూస్‌ను ప్రతి రోజు తాగగడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది.
- ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
- బాదం జ్యూస్ శరీరానికే కాకుండా మెదడకు కూడా ఎంతో పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
- ఈ జ్యూస్‌లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
- ఎండా కాలంలో ప్రతి రోజు బాదం జ్యూస్ తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా సులభంగా పెరుగుతుంది.
తయారీ విధానం..
ముందుగా ఒక చిన్న కప్పు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో బాదం పప్పును వేసుకుని ఒక రాత్రంతా నానబెట్టండి. ఇలా నానబెట్టిన బాదంను ఉదయం బాదంల తొక్కలను తీసివేయండి. బాదం, పాలు, చక్కెర, యాలకుల పొడి, జాజికాయ పొడిని ఒక మిక్సీలో వేసి మెత్తగా డ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వడకట్టుకుని గ్లాస్‌లో తీసుకోవాల్సి ఉంటుంది. జ్యూస్‌ను ఒక గ్లాసులో పోసిన తర్వాత ఐస్ ముక్కలను వేసుకుని తీసుకుంటే టేస్టీగా ఉంటుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఇది చదవండి: కంటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన ఫుడ్స్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి