Health Tips:
జలుబు, దగ్గు వంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల కారణంగా గొంతులో మంట, గొంతు నొప్పి(Throat Pain), గొంతు బొంగురు పోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. గొంతు నొప్పి బాగా ఎక్కువగా మారినప్పుడు ఆహారాన్ని కూడా మింగలేని పరిస్థితి వస్తుంది. అయితే గొంతు నొప్పి తగ్గాలంటే మనం కొన్ని వంటింటి చిట్కాలను పాటించాల్సిన అవసరం ఉంది. వేడి నీళ్లలో తేనె కలుపుకొని తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. తేనె లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు మంటను, నొప్పిని దూరం చేసి కాస్త రిలీఫ్ నిస్తుంది.
ఇది చదవండి: దోసకాయ వలన కలిగే లాభాలు..!
గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే అల్లం టీ తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది. అల్లం టీ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు నొప్పి నుంచి మంచి రిలీఫ్ ఇస్తాయి.గొంతు వాపును, నొప్పిని అల్లం టీ తగ్గిస్తుంది. అల్లం టీతో జీర్ణ సమస్యలు కూడా బాగా తగ్గుతాయి. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందాలంటే మూలికలతో తయారు చేసిన హెర్బల్ టీ, చామంతి టీ తాగితే మంచిది. వీటిలో ఉన్న ఔషధ గుణాలు గొంతు నొప్పిని, మంటను బాగా తగ్గిస్తాయి. గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి వేడి నీళ్లను తాగడం మంచిది.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి