టీ(Tea)లో బిస్కెట్లు(Biscuits) ముంచుకొని తినే అలవాటు చాలామందికి ఉంటుంది. కొందరైతే చాయ్ బిస్కెట్లతోనే రోజును ప్రారంభిస్తారు. చల్లని వాతావరణంలో ఈ కాంబినేషన్ టేస్ట్ చేయాలని మనసు లాగేస్తుంది. ఒక్కసారి అలవాటయితే ఈ రుచికరమైన కాంబోనూ రోజూ ఆస్వాదించాలనే కోరిక బాగా కలుగుతుంది. కొన్ని రకాల బిస్కెట్లలో కేలరీలు, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల టీతో బిస్కెట్లు తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంది. టీలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నా, బిస్కెట్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. బిస్కెట్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా వాటిని టీలో ముంచి తింటే పళ్లు పాడయ్యే ప్రమాదం పెరుగుతుంది.
ఇది చదవండి: షుగర్ తో బాధపడుతున్నారా..?
ముఖ్యంగా దంతాలు పుచ్చిపోయే ముప్పు రెట్టింపు అవుతుంది. టీతో పాటు బిస్కెట్లు తినడం మొదలుపెడితే త్వరగా ఆపలేం. అవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ఎంత తిన్నా మళ్లీ తినాలనిపిస్తుంది. చాలా ఎక్కువగా తినేశాక కడుపు నిండిన భావన కలుగుతుంది. తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాలు తినబుద్ధి కాదు. దాంతో శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు, ఆహారాలు లోపిస్తాయి. ఫలితంగా అజీర్తి, అపానవాయువు, ఛాతీలో మంట, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. చక్కెర పానీయాలు రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. బిస్కెట్లలోని అధిక చక్కెర కూడా ఇమ్యూనిటీ పవర్‌ను దెబ్బతీస్తుంది. రోజూ టీతో పాటు వీటిని తింటూ ఉంటే రోగనిరోధక శక్తి పూర్తిగా క్షీణించవచ్చు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.