Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home National బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ దేశ రాజధాని ఢిల్లీ..

బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ దేశ రాజధాని ఢిల్లీ..

by Satya
Delhi Bomb Threat

బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఢిల్లీ(Delhi), నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 50కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్‌ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. ఆపై పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.

బాంబు బెదిరింపు కారణంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో జరగాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. మరోవైపు బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెయిల్ పంపిన అగంతకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈమెయిల్ పంపడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ సర్వర్ విదేశాల్లో ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. నోయిడా-ఘజియాబాద్-ఢిల్లీ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ఐపీ అడ్రస్‌తో ఈమెయిల్ పంపినట్లు అనుమానిస్తున్నారు.

స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ఒకే వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని కనుక్కొనేందుకు పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఉదయం నుంచి చాలా స్కూళ్లకు ఈమెయిల్స్ వచ్చాయని ఢిల్లీ డీసీపీ అపూర్వ గుప్తా చెప్పారు. స్కూళ్లను ఖాళీ చేసేశారని అన్నారు. మాకు తెలిసినంత వరకు ఈ మెయిల్స్‌లోని కంటెంట్ అంతా ఒకే మాదిరిగా ఉందని పేర్కొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News


  • నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.
    గణేశ్ చతుర్థి వేడుకలకు ముందే మహారాష్ట్రలో పర్యావరణ హిత గణపతి విగ్రహాల తయారీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నవీ ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’లో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్…
  • తమిళనాడు సీఎం విజయ్ పాలనపై స్టాలిన్ ఫైర్.
    తమిళనాడు రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య విమర్శలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై డీఎంకే నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసెంబ్లీని సినిమాలు తీసే ప్రదేశంగా మార్చేశారని ఆరోపించారు. పరిపాలనను కూడా సినిమా షూటింగ్‌లా నడుపుతున్నారని ఎద్దేవా…
  • ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.
    భారత్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత్‌ మండపంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. 2026 సంవత్సరానికి బ్రిక్స్‌ అధ్యక్ష బాధ్యతలను భారత్‌ చేపట్టడంతో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: