AP Election Heat:
14 నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో(Kurnool) ఈసారి ప్రజలు తీర్పు ఎలా ఉండబోతుంది…? కర్నూలు జిల్లా సెంటిమెంట్ నాయకులు కలిసివస్తుందా…! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి (Election Heat) నిప్పుల సెగలు కక్కుతుంది. ఎన్నికల సంగ్రామానికి మరికొద్దిరోజులే సమయం ఉండడంతో రాజకీయ పార్టీ నాయకుల్లో అలజడి మొదలైంది. ఈ సారి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ నాయకుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో రాయలసీమ ముఖ ద్వారమైన కర్నూలు జిల్లా ఈ ఎన్నికల్లో కీలకం కానుంది.
రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా నుంచి పోటీ చేసిన నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అయిన చరిత్ర కలిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాపై పట్టు సాధించుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్న వ్యూహత్మక రచనలు మాములుగా లేవు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక జరిగిన 2014 ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పార్టీకి కేవలం 3 అసెంబ్లీ స్థానాలు మాత్రమే లభించాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మిగితా 11 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో వైస్సార్సీపీ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుపొందిన అనూహ్యంగా రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని చేపట్టింది. కానీ మళ్ళీ 2019 ఎన్నికల్లో వైస్సార్సీపీ 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలిచి ఉమ్మడి కర్నూలు జిల్లాను క్లీన్ స్వీప్ చేసి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టింది. కానీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుస పర్యాటనలు చేస్తూపార్టీ నాయకులు కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు.
అదే రీతిలో ప్రస్తుతం వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న.. వరుసగా జిల్లా పర్యటనలు చేపడుతున్నారు. ఎంతలా అంటే గడిచిన నెలరోజులలో ఏకంగా 5 సార్లు జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి మరో మారు తన మార్క్‌ను వేసుకునేందుకు జిల్లాకు రానున్నారు. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఈ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే ను కాదని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను రంగంలోకి దించిన జగన్ ఎలాగైనా కర్నూలు అసెంబ్లీ సెగ్మెంట్ లో తన అభ్యర్థి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ AMd ఇంతియాజ్ అహ్మద్ ను గెలుపుంచుకునేందుకు జిల్లా కేంద్రంలో ఉన్న వైస్సార్ సర్కిల్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఎన్నికల్లో తమ పట్టు సాధించుకునేందుకు టీడీపీ, మరోవైపు తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు వైస్సార్సీపీ పార్టీలు తీవ్రంగానే శ్రామిస్తున్నాయి. కానీ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది అనే ఉత్కంఠ మాత్రం నాయకులకు గుబులు పుట్టిస్తుంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.