ఆంధ్రాలోని నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి తెలంగాణ(Telangana) జిల్లాల్లోకి భారీ స్థాయిలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అశ్వారావుపేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఏపీ కి చెందిన బొలెరో వాహనంలో 165 బ్యాగుల్లో 359 కిలోల గంజాయిని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు మాటు వేసి 11 మంది స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పనసకాయలు రవాణా నెపంతో భారీ స్థాయిలో గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. అశ్వారావుపేట సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న 359 కేజీల గంజాయి విలువ సుమారు 89 లక్షల 83 వేలు ఉంటుందని అంచనా. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని ఎస్సై తెలిపారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- పల్లె, పట్నం తేడా లేకుండా వణికిస్తున్న చలిపల్లె పట్నం తేడా లేకుండా రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. పలుచోట్ల రాత్రిళ్లు చలి మంటలు, ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్రంపై మంచుదుప్పటి పరుచుకున్నట్లు వాతావరణం మారింది. రాత్రిపూటే కాకుండా మిట్ట…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.