మావోయిస్ట్ పార్టీ భారత్ బంద్ ప్రకటన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారాం గ్రామంలో రూరల్ సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేని 15 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అనంతరం గ్రామంలో విస్కృత తనిఖీలు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులకు సీఐ సూచించారు. గ్రామంలో ప్రజలందరి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, నేర నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ప్రజల రక్షణ, భద్రత పూర్తిగా పోలీసులదే అని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో కొత్త వ్యక్తులు ఇల్లు అద్దె కొరకు వస్తే పూర్తి వివరాలు అడిగి వారి వద్ద నుండి గుర్తింపు కార్డులు తీసుకోవాలని ఏదైనా అనుమానం వస్తే వెంటనే 100కి డయల్ చేయాలని ఆయన తెలిపారు. నిరంతరం ఈ తనిఖీలు చేయడం వల్ల నేరాల రేటు తగ్గి ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చునని ఆయన చెప్పారు. ప్రాణహిత గోదావరి పరివాహక అటవీ ప్రాంతంలో పోలీసులతో కుంబింగ్ నిర్వహించి తగు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Also..