114
శ్రీకాకుళం జిల్లాలలో కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తోంది. ఇచ్చాపురం నియోజకవర్గం లోని మండలాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురౌతున్నారు. కంచిలి మండలంలోని మండపల్లి గ్రామంలో ఒక ఆవుల శాలపై పెద్దపులి దాడి చేసి ఒక ఆవును చంపింది. ఉదయం రైతు వచ్చి చూడగా ఒక ఆవు కనిపించడం లేదని గుర్తించాడు. ఆవు కోసం వెతికి చూడగా 100 మీటర్ల దూరంలో చనిపోయిన ఆవు కనిపించింది. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సమాచారం అందిస్తే గాని ఫారెస్ట్ అధికారులు రాకపోవడం, పెద్దపులి భారీ నుంచి ప్రజలను కాపాడే చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్న అటవీ శాఖ అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.