#AndhraPradesh #
ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. APSRTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేలా ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని అమలుచేయనుంది ప్రభుత్వం. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబరు 3న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు సిఎం చంద్రబాబు. ఈ మేరకు ఆ పథకాన్ని ఇవాల్టి నుంచి అమలు చేయనున్నారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రిపై భేటీయై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
AP: ఉమ్మడి గుంటూరు జిల్లా
జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. రెండవ రోజు నామినేషన్ల వేయనున్న ప్రధాన పార్టీలు. గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కిలారి వెంకట రోశయ్య. బాపట్ల నియోజకవర్గ వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధిగా నామినేషన్ వేయనున్న కొన రఘుపతి. మంగళగిరి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంఎల్ఏ అభ్యర్ధిగా మురుగుడు లావణ్య. మాచర్ల నియోజకవర్గం నుంచి వైసిపి ఎంఎల్ఏ అభ్యర్ధి తరుపున డమ్మీ నామినేషన్ల దాఖలు చేయనున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.
- ‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
- నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: జిల్లాలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.
హైదరాబాద్(Hyderabad)ను మరో 10 ఏళ్ల పాటు ఏపీ, తెలంగాణ(Telangana) ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన ప్రజాసంక్షేమ సేవా సంఘం కార్యదర్శి పొదిలి అనిల్‌కుమార్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఏపీ సీఎస్, పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ఇది చదవండి: అమలు లోకి మరో గ్యారెంటీ పథకం…
హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించిన 10 ఏళ్ల గడువు ఈ జూన్ 2తో ముగుస్తున్నా, ఏపీ విభజన చట్టం-2014 ప్రకారం ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ కొన్ని అంశాలు పరిష్కారం కాలేదన్నారు. ఆస్తులు, అప్పులు, తొమ్మిదో షెడ్యూల్లో పేర్కొన్న వివిధ కంపెనీలు, కార్పొరేషన్ల విభజన ప్రక్రియ పూర్తికాలేదని పేర్కొన్నారు. కాబట్టి, 2034 జూన్ 2 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉంచాలని కేంద్రాన్ని కోరుతూ చర్యలు తీసుకునేలా ఏపీ సీఎస్‌ను ఆదేశించాలన్నారు. విభజన చట్టం నిబంధనలను కేంద్ర హోం శాఖ అమలు చేయకపోవడాన్ని రాజ్యాంగ, చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయ విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఏపీకి రాజధాని లేకుండా పోయిందని పిటిషన్లో పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి
పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం. తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు అన్నారు.
ఏపీలో నాసిరకం మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. దశలవారీగా మద్యం నిషేధిస్తామని చెప్పిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం అమ్మకాలు మొదలుపెట్టి డబ్బును ప్యాలెస్‌కు తరలిస్తున్నారని విమర్శించారు. మద్యం ధరలు పెంచడమే కాదు నాసిరకం మద్యాన్ని పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. ఇసుక లభించక లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామన్నారు. అర్హతలేని వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించారని విమర్శించారు. సామాజిక న్యాయం అంటే నీ సొంత వర్గానికి న్యాయం చేయటమా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
భవిష్యత్ తరాలకు గుర్తుండే విధంగా రాయచోటి అభివృద్ధి జరుగుతోందని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని వందపడకల ఆసుపత్రి, ఆర్ టి సి బడ్ స్టాండ్ విస్తరణ భవనాల పనులను మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాష, జిల్లా వైసిపి విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తో కలిసి పరిశీలించారు. ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద ఆర్చి నిర్మాణ పనులను, అదేవిధంగా రహదారి నిర్మాణాల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. నాడు – నేడు క్రింద ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలల అభివృద్ధి ఎంతో జరిగిందన్నారు. పట్టణంలో 4 అర్బన్ హెల్త్ క్లినిక్ లను అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలను కూడా ఇక్కడే ఏర్పాటు చేసి మహిళా ప్రాంగణంగా తీర్చిదిద్దుతున్నామని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా
పట్టణ పేదల కోసం నారాయణరెడ్డి పల్లె జగనన్న కాలనీలో 6 వేల ఇళ్ల నిర్మాణాలు, ఎం ఐ జి లేఔట్ లను త్వరగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
Read Also..
Read Also..
నేడు సీఎం వైఎస్ జగన్ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో 2003 కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో 27.41 లక్షల ఎకరాలపై పేదలకు యాజమాన్య హక్కులు ఇవ్వనున్నారు. నిరుపేదలకు కొత్తగా 46 వేల ఎకరాల పంపిణీ జరుగనుంది. అనంతరం నూజివీడులో బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం రానున్నారు.
Read Also..
Read Also..
తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలపై భారత వాతావరణ శాఖ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇవాళ, రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ హజరయ్యారు. నరేంద్ర మీడియాతో మాట్లాడుతూ సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని హుకుం జారీ చేసిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే 100 పరిమిషన్లు తీసుకోవాలని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం, ఇసుక మీద చాలా దోచుకుంటున్నారన్నారు. నందిగామలో ముగ్గురు చిన్నారులు చనిపోయారని దానికి వైసిపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు ఇక్కడ మన ఎమ్మెల్యే దోచుకుంటాడని విమర్శించారు.
Read Also..
Read Also..