అంతరాష్ట్ర దొంగలను మదనపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద రూ. 8 లక్షల విలువైన 100 గ్రాముల బంగారం, 50,000 నగదు, ఒక బైకును సీజ్ చేశారు. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టుకు సంబంధించి మదనపల్లి డిఎస్పీ కేశప్ప కార్యాలయంలో మీడియాకు డిఎస్పీ కేశప్ప, తాలూకా సీఐ సత్యనారాయణ, ఎస్ ఐ సుధాకర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఉమ్మడి చిత్తూరు జిల్లా, మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాలలో ఇళ్లల్లో జరుగుతున్న వరుస చోరీలను నిరోధించే క్రమంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాల మేరకు మదనపల్లి డిఎస్పీ K.కేశప్ప పర్యవేక్షణలో మదనపల్లి తాలూకా పొలిసు స్టేషన్ ఇన్స్పెక్టర్ A. సత్యనారాయణ నేతృత్వంలో స్పెషల్ పార్టీ బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించా మన్నారు. ఇందులో భాగంగానే గతంలో మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు మదనపల్లె పట్టణ పరిసర ప్రాంతాలలో ఇళ్లల్లో దొంగతనాల కేసులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కొన్ని నేరాలకు పాల్పడిన ఇద్దరు ముద్దాయిలను గుర్తించడం జరిగిందన్నారు. వారిపై నిఘా పెట్టి మదనపల్లి పట్టణం మోతీ నగర్ కు చెందిన ఎస్ .షాహిద్ భాష (20), తమిళనాడు రాష్ట్రం గుడియాత్తం పట్టణానికి చెందిన ఎన్. అహ్మద్ భాష(31)లను మదనపల్లి పట్టణంలోని బసినికొండ సచివాలయం సమీపంలో అరెస్టుచేసి వారి వద్ద సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు (చోరీ సొత్తు) మరియు 50వేల రూపాయలు నగదు, బైకును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఇంకా ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేయాల్చి ఉందన్నారు. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు ముఖ్యమైన గమనిక మీరు బయట ఊర్లకు వెళ్ళినప్పుడు విలువైన బంగారు ఆభరణాలు నగదును ఇంటిలో పెట్టి వెళ్ళరాదు ఏదైనా బ్యాంకు లాకర్లో భద్రపరుచుకోవాల్సిందిగా మరియు మీరు బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు లాక్డ్ హౌస్ వివరాలను తప్పకుండా మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్ నందు సమాచారం ఇచ్చిన ఎడల మేము మా సిబ్బందితో ప్రతిరోజు అప్రమత్తంగా ఉంటామని తెలిపారు.
Read Also..