Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Telangana కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satya
Kishan Reddy

బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. బీసీ ముఖ్యమంత్రి హామీ పట్ల తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుందన్నారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ యువత, మహిళలు ప్రధాని మోదీకి అండగా నిలబడుతున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా బీజేపీకి జైకొడుతున్నట్లు చెప్పారు. ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండేది బీజేపీ మాత్రమేననే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు. కాంగ్రెస్,బీజేపీ మాటలు కొటలు దాటుతాయని, కానీ చేసే పని మాత్రం ప్రగతి భవన్, గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోందని, కానీ ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదన్నారు.

Advertisements

You may also like

Our Visitor

039626
Total views : 198778

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: