పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం sss హోమ్ ఫుడ్ స్వీట్స్ వారి నిర్వాకం బయటపడింది. sss హోమ్ ఫుడ్స్ స్వీట్ స్టాల్ నిర్వాహకులు నిల్వ ఉన్న స్వీట్స్ ను కస్టమర్లకు అంటకడుతున్నారు. భరించలేని వాసనతో నిల్వ, కాలం చెల్లిన, పాడైన స్వీట్స్ ను జొమాటో ద్వారా కస్టమర్లకు పంపిణీ చేస్తున్నారు. నిన్న సత్యవతి నగర్ కు చెందిన ఎం.తేజ అనే విద్యార్థి ఆన్లైన్ లో స్వీట్స్ ఆర్డర్ చెయ్యగా ఇలా నిల్వ ఉండి భరించలేని వాసన వచ్చిన స్వీట్స్ ను sss హోమ్ ఫుడ్స్ స్వీట్ షాప్ నిర్వాహకులు పంపిణీ చేశారు. ఆన్లైన్ లో నిల్వ సరకు పంపితే చాలామంది తిరిగి పంపకుండా అలా చూసి వదిలేస్తుండటంతో ఇలా నిల్వ సరుకు కస్టమర్లకు అంటగడుతున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఇదే వ్యక్తి ఆన్లైన్ లో వేరే స్వీట్స్ షాపునకు ఆర్డర్ పెట్టగా ఇలాగే నిల్వ సరుకు రావడంతో రిటర్న్ పెట్టినా ఏదో కంటితుడుపు చర్యగా అందులో కొద్దిగా క్రెడిట్స్ ఇచ్చి చేతులు దులుపకున్న సదరు జొమాటో కంపెనీ. Sss హోమ్ ఫుడ్ స్వీట్స్ వారిపై జిల్లా ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ కు ఫిర్యాదు చేయనున్న బాధితుడు. ఇటువంటి చర్యలకు పాల్పడుతూ వినియోగదారుల ఆరోగ్యంతో ఆటలాడుతున్న సదరు sss హోమ్ ఫుడ్ స్వీట్ స్టాల్ పై సంబందిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also..