ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు గత ఆరునెలలుగా జగన్ సర్కారు రూ.1000కోట్లరూపాయలు బకాయిలు పెట్టినందున ఈనెల 27వతేదీ నుంచి వైద్యసేవలు నిలిపివేస్తామని ఎపి స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడం రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోంది. కరోనా విపత్తు సమయంలో సాక్షాత్తు సిఎం సొంత జిల్లా కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించబడవని బోర్డులు పెట్టినపుడే జగన్ రెడ్డి పనితనమేమిటో రాష్ట్రప్రజలకు అర్థమైంది. చేతగానిపాలనతో ఖజానాను దివాలా తీయించిన ముఖ్యమంత్రి ముఖం చూసి కాంట్రాక్టర్లు పరారు కావడం చూశాం. స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లకు దిక్కులేక వాట్సాప్ లో ప్రశ్నాపత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితిని కూడా చూశాం. నాలుగున్నరేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో ట్రిపుల్ ఎ ప్లస్ గా ఉన్న రాష్ట్ర పరపతిని ట్రిపుల్ బి ప్లస్ కు దిగజార్చారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా లక్షలాది నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.…నారా లోకేష్
Read Also..