52
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం గండి చెరువులోనికి మిచాంగ్ తుఫాన్ ప్రభావంవల్ల ఎగువున వున్న కాలువలు చెరువులు పొంగిపొరలి చెరువులోనికి భారీగా వరదనీరు చేరడంతో, నీటి ఉదృతికి మత్స్యకారుల వలలు కొట్టుకు పోవటంతో, లక్షలాది రూపాయల విలువైన మత్స్య సంపద కొట్టుకు పోయిందని గంగ పుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సంఘంద్వారా ఇటీవల 8లక్షల విలువైన చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువులో విడుదల చేశామని ప్రభుత్వం సబ్సిడీపై అందించిన లక్ష రూపాయల విలువైన చేపపిల్లలు 50వేల రూపాయల విలువైన వలలు కొట్టుకుపోయాయని మత్స్యకారులు తెలిపారు. చేపలవేట ద్వారా సంఘంలోని 2వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నమని వరదల వల్ల తీవ్రంగా నష్ట పోయామని మత్స్య కారులు ఆవేదన చెందుతున్నారు.
Read Also..