మిచౌంగ్ తుఫాన్ తిరుపతి జిల్లాను అతలాకుతలం చేసింది. తుఫాన్ దెబ్బకు పంటనష్టంతో పాటు రహదారులు కూడా భారీగా దెబ్బతిన్నాయి. తుఫాన్ తాకిడికి దెబ్బతిన్న ముంపు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తుఫాన్‌తో దెబ్బతిన్న పంట పొలాలను, రహదారులను కేంద్ర బృంద సభ్యులు పరిశీలించారు. స్థానిక రైతులు, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గూడూరులో తుఫాన్ ధాటికి సర్వనాశనమైన పొలాలను శాసనసభ్యులు వరప్రసాద్ కేంద్ర బృందం దృష్టికి తీసుకువచ్చారు. తుఫాన్ ధాటికి అన్నదాతలు భారీ నష్టాన్ని మూటగట్టుకున్నారని, మానవతా దృక్పథంతో కేంద్రానికి నివేదించాలని ఎమ్మెల్యే కోరారు.
Michoung typhoon
ప్రకాశం జిల్లా మార్కాపురం లో తుఫాను ప్రభావం వలన వర్షాలు పడటంతో మార్కాపురం లోని పలు ప్రాంతాల్లో ఆఫ్రికన్ నత్తలు సందడి చేస్తూ కనిపించాయి. స్థానిక మాగుంట మున్సిపల్ పార్క్ లో వాకర్స్ కు, అరుదైన జాతికి చెందిన ఆఫ్రికన్ నత్తలు పెద్ద సంఖ్యలో కనిపించాయి. ఈ నత్తలు మొక్కలను, చెట్లను ఆహారం గా తీసుకుని పర్యావరణాన్ని తీవ్రంగా నాశనం చేస్తాయని పలువురు పర్యావరణ పరిరక్షకులు తెలిపారు. వెంటనే ఈ నత్తలను నివారించడానికి కృషి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు .వాటిని అలాగే వదిలేస్తే వాటి సంఖ్య పెరిగి మొక్కలు మొత్తం సర్వనాశనం చేస్తాయని పర్యావరణ పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఆఫ్రికన్ నత్తలను నివారించడానికి ప్రయత్నం చేయాలన్నారు.
Read Also…
Read Also…
తిరుపతి జిల్లా లో మిచాంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత ఉన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇంఛార్జి మంత్రి కళత్తూరు నారాయణ స్వామి, రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి వర్యులు పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి, టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి ఆర్కె రోజా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, డిఐజి అమ్మిరెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత, స్థానిక ఎమ్మెల్యే మరియు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ శిరీష, జెడ్పీ ఛైర్మెన్ గోవిందప్ప శ్రీనివాసులు, తిరుపతి ఆర్డీవో రవిశంకర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ విమలా కుమారి, స్వాగతం పలికారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ ద్వారా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటన నిమిత్తం వాకాడుకు ముఖ్యమంత్రి బయల్దేరి వెళ్ళారు. వీరి వెంట రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు తేనేటి వనిత, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, జిల్లా కలెక్టర్ వెంకట రమణా రెడ్డి ఉన్నారు.
విజయనగరం జిల్లా శృంగవరపు కోట మిచౌంగ్ తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటను శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు పరిశీలించి రైతులకు దైర్యం చెప్పారు. నియోజకవర్గంలో కొత్తవలస మండలం చిన్నిపాలెం పంచాయితీ పరిధిలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టం జరిగిన ప్రాంతాలలో శృంగవరపుకోట శాసనసభ్యులు పర్యటించి పంట నష్ట తీవ్రతను పరిశీలించి అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులు తమ గోడును ఎమ్మెల్యే కి విన్నవించుకున్నారు. నిర్మాణ దశలో ఉన్న నేషనల్ హైవే కోసం దగ్గరలో వున్న చెరువు గట్టును సగం తొలగించివేయడంతో తుఫాను సమయంలో ఆ చెరువు క్రింద ఉన్న పొలాలు మొత్తం సుమారు 25 ఎకరాలు నీట మునిగిపోయాయని రైతులు మొరపెట్టుకున్నారు. అనంతరం రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రతిఒక్క గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దని చెప్పారు. అక్కడికి వచ్చిన వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క పంట నష్టానికి కారణమయిన నేషనల్ హైవేకి వ్యతిరేకంగా రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలంటూ స్థానిక రైతులు రోడ్ పై నిరసన తెలియజేశారు.
Read Also…
Read Also…
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట పొలాలు పరిశీలిస్తారు. బాపట్ల తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వేగేశన నరేంద్ర వర్మ మీడియాతో మాట్లాడుతూ.. మిచౌంగ్ తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా తీవ్రంగా నష్టపోయింది. బాపట్ల పట్టణంలో పారిశుధ్యం అధ్వాన్నంగా తయారైంది, వర్షపునీరు మురుగునీరు ఎక్కడికక్కడే ఆగిపోయింది. బాపట్ల మండలం భర్తిపూడి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శిలా విగ్రహం తలను పగలకొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పిరికి పందల చర్య, విగ్రహం ధ్వంసం చేసిన వారిని తక్షణమే శిక్షించాలి. తెలుగు వారి ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన నాయకులు నందమూరి తారక రామారావు, సంస్కార లేని వైసిపి మూకలు చేసిన దుశ్చర్య గా భావిస్తున్నాం . కూడు, గూడు, గుడ్డ సామాన్యుడి కి అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఏర్పడింది. ఎవరేమనుకున్నా సరే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే అల్లరి మూకల ఆటకట్టిస్తాం.
మిచౌంగ్ తుఫాను కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. కుండపోత వర్షలు వరదలకు జన జీవనం వక్క సారిగా స్తంభించిపోయింది. కనీస నిత్యవసరాలు, కరెంటులేక, నీళ్లురాక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారు. నిరాశ్రయులైన వారికి ప్రభుత్వం సాయం అందిస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం గ్రామంలోని తుఫాన్ ప్రభావంతో నిరాశ్యులైన పలువురికి నిత్యావసర సరుకులు, 25 కిలోల బియ్యాన్ని జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, మంత్రి బాధితులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ… తుఫాను ప్రభావంతో అధికారులను అప్రమత్తం చేసి ప్రాణ నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు మేలు చేయాల్సింది మరిచి ఇలాంటి టైంలో రాజకీయాలు మాట్లాడటం సవాబ్ కాదు అన్నారు. మీకు చేతనైంది మీరు చేయండి అని ఆనందబాబుకు సవాళ్లు విసిరారు. మీ ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అన్నారు. అదే మన ముఖ్యమంత్రి వ్యవసాయం పండగానే నినాదంతో ప్రతి రైతుకు సాయం అందిస్తారని విమర్శించారు.
Read Also…
Read Also…
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మీచాంగ్ తుఫాన్ ప్రభావంతో కరగ్రహారం, క్యాంబిల్ పేట, చిన్నకరగ్రహారం, పల్లిపాలెం, నవీన్ మిట్టల్ కాలనీ, మేకవాని పాలెం, తాళ్లపాలెం, మంగినపూడి, తుమ్మలచెరువు, పేద యాదర, చిన యాదర, భోగిరెడ్డిపల్లి, నెలకుర్రు చిన్నాపురం, గ్రామాలలో నీట మునిగి దెబ్బతిన్న వరి, వేరుశనగ, మినువు పంటలు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో మొత్తం పొలాలు నీళ్లతో నిండిపోయి, అమ్ముకోవడానికి వీలు కాకుండా కుళ్లిపోయి నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించి తక్షణమే అధికారులు స్పందించి రైతాంగానికి ఇన్సూరెన్స్ కింద ఆదుకోవాలని కోరిన మాజీ మంత్రి వర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర వారితో పాటు మచిలీపట్నం నియోజకవర్గ రూరల్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని రంగు మారిందాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీ మాగంటి బాబు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెర్కెగూడెం గ్రామంలో మిచాంగ్ తుఫాను కారణంగా వరి పంటను గురువారం టిడిపి నాయకులతో కలిసి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతాంగం తుఫాను కారణంగా ఎంతో నష్టపోయారని కానీ ప్రభుత్వం ఇప్పటివరకు నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. ఇప్పటికే వరి రైతుల 40000 పొగాకు రైతులు 1లక్ష, పెట్టుబడులు పెట్టారని కనీసం 10000 దిగుబడి వచ్చే అవకాశం లేదని వివరించారు. పంట పొట్ట దశలో ఉన్నప్పుడు కనీసం నీటినందించక పోవడంతో కొంతమేర దెబ్బతిన్న, తుఫానుతో పూర్తిగా పంట రైతులు నష్టపోయారని వాపోయారు. టిడిపి నిర్మించిన పట్టిసీమ ద్వారా నీటిని తోడుకొని కృష్ణ డెల్టా రైతులకు అందించవలసి ఉన్న అటువైపు దృష్టి సారించలేదని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్ పై రెండు ప్రభుత్వాలు కలిసి నీళ్ల కోసం తోలుబొమ్మలాడారని ఎద్దేవా చేశారు. రైతులను వెంటనే ఆదుకోవాలని లేకపోతే టిడిపి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Read Also..
తుఫాన్ కు దెబ్బ తిన్న ప్రతి పంట నష్ట నివారణ కు ఎన్యూమరేషన్ వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో తక్షణమే చేయాలి. ఎకరాకు వరి కీ, మొక్కజొన్న కీ, పత్తి పంట కు 50 వేలురూపాయల చొప్పున ఎకరాకు మిర్చి పంటకు 1 లక్ష రూపాయల చొప్పున, కూరగాయల రైతులకు 30 వేల రూపాయలు, ఎకరం కు నష్ట పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. మిచంగ్ తుఫాను ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో వరి, మొక్కజొన్న ,పత్తి, మిరప , కూరగాయల పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఇబ్రహీంపట్నం సడక్ రోడ్డు, జూపూడి,తుమ్మలపాలెం, గుంటుపల్లి, ఈలప్రోలు, గ్రామంలో నీట మునిగిన వరి, మొక్కజొన్న కూరగాయల తదితర పంటల రైతులను వివరాలు తెలుపుకున్నారు. నోటికాడికి వచ్చిన కూడు నేలపాలు అయిందంటూ వాపోయారు. పంటలు చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కురిచి పంటలు దెబ్బతిన్నాయని, రైతుల పరిస్థితి, పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది అని, చేతికి వచ్చిన పంట నెలపాలుఅయింది, పెట్టిన పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు అకాల వర్షాలు రైతులను నష్టాల్లోకి నెట్టాయి అని అన్నారు. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు క్రింది స్థాయికి పంటల పరిశీలనకు వెళ్లాలని, నిష్పక్షపాతంగా ఎన్యుమురేషన్ చేయాలని,వరికి 50 వేలు, మొక్కజొన్న కి 50 వేలు, మిర్చి 1 లక్షలు, ప్రత్తి 30 వేలు, చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మిచాంగ్ తుఫాను నేపథ్యంలో చెన్నై నుండి వెళ్లవలసిన పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. దానాపూర్ నుండి బెంగళూరు వెళ్లే సంఘమిత్ర ఎక్స్ ప్రెస్, గోరకపూర్ నుండి కొచ్చివేలి వెళ్లే రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్, చెన్నై నుండి న్యూఢిల్లీ వెళ్లే జిటి ఎక్స్ ప్రెస్, తిరువనంతపురం నుండి న్యూఢిల్లీ వెళ్లే కేరళ ఎక్స్ ప్రెస్, చెన్నై నుండి లక్నో వెళ్లే ఎక్స్ ప్రెస్, తిరునల్వేలి నుండి కాట్రా వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్, రామేశ్వరం నుండి బనారస్ వెళ్లాల్సిన ఎక్స్ ప్రెస్, కోర్బా నుండి కొచ్చివేలి వెళ్లవలసిన ఎక్స్ ప్రెస్, ఎర్నాకులం నుండి పాట్నా వెళ్ళవలసిన ఎక్స్ ప్రెస్, భగత్ కి కోటి నుండి మన్నారు గుడి వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైలు ఈనెల 7వ తేదీ వరకు అధికారులు రద్దు చేశారు. పరిస్థితిని బట్టి రైళ్ల రద్దు పొడిగించే అవకాశం ఉంది.





Total views : 54434