Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Andhra Pradesh శ్రీకాకుళం జిల్లాలో భారీ గోల్క్ స్కామ్..

శ్రీకాకుళం జిల్లాలో భారీ గోల్క్ స్కామ్..

by CVR NEWS
శ్రీకాకుళం జిల్లాలో భారీ గోల్క్ స్కామ్

శ్రీకాకుళం జిల్లా రాజాంలో భారీ గోల్డ్ స్కీమ్ కుంభకోణం బట్టబయలైంది. ఆకర్షణీయమైన ప్రకటనలు.. ఆశచూపే ఆఫర్లు.. వీటి వెనుక సామాన్యులను నిలువునా ముంచేస్తున్న ‘వైశ్య రాజు జువెలరీ’ ఆగడాలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. CVR న్యూస్ నిర్వహించిన ప్రత్యేక స్ట్రింగ్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 11 నెలల బంగారు నగల పథకం పేరుతో రాజాం పట్టణంలోని వైశ్య రాజు జువెలరీ సామాన్యుల ఆశలను పెట్టుబడిగా మార్చుకుంటోంది. 1978 చిట్‌ఫండ్ చట్టం ప్రకారం ఇటువంటి డిపాజిట్ స్కీమ్‌లు నిర్వహించడం నేరమని తెలిసినా.. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఈ సంస్థ యథేచ్ఛగా అక్రమ దందాను కొనసాగిస్తోంది. కస్టమర్ల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నా, ఎటువంటి అధికారిక పత్రాలు ఇవ్వకుండా, ప్రభుత్వానికి చెల్లించాల్సిన GSTని ఎగవేస్తూ అక్రమ వ్యాపారానికి తెరలేపింది. 24 క్యారెట్ల బంగారానికి డబ్బులు వసూలు చేసి, తీరా 11 నెలల తర్వాత మాత్రం 22 క్యారెట్ల బంగారాన్ని అంటగడుతున్నారు. తరుగు, మజూరీ లేదని నమ్మించి.. చివరకు కస్టమర్లకు భారీగా నామం పెడుతున్నారు. ఇక పాత బంగారం డిపాజిట్ చేస్తే ఆరు నెలల తర్వాత కొత్త నగలు ఇస్తామని చెప్పి.. తీరా గడువు ముగిశాక 8.4 శాతం వరకు తరుగు వేస్తూ వినియోగదారుల కళ్లకు గంతలు కడుతున్నారు. బహిరంగంగానే ఈ అక్రమ స్కీమ్‌లు నడుస్తున్నా.. సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సదరు యాజమాన్యం బోర్డు తిప్పేస్తే తమ పరిస్థితి ఏంటని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అడ్డగోలుగా సామాన్యుల రక్తాన్ని పిలుస్తున్న ఇటువంటి సంస్థలపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాజాం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: