తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో వేగి కృష్ణారావు కాట్రగడ్డ శ్రీనివాస్ అనే ఇద్దరు కవులుకు భూమి తీసుకొని వరి పంట వేసి జీవనం సాగిస్తున్నారు. పంట చేతికి వచ్చి కోత కోసే సమయంలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం వుంటుందనే ఉద్దేశంతో కోత కోయలేదు. ఆదివారం ఉదయం వూహించని రీతిలో కష్టించి పండించిన 20 ఎకరాల వరిపంట మంటల్లో కాలి బూడిద అవడంతో రైతులిద్దరూ నిర్ఘాంత పోయి దిక్కుతోచని స్థితిలో వుండగా, స్థానిక రైతులు కొవ్వూరు ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో మంటలను అదుపుచేయటం తో మరింత నష్టం వాటిల్ల కుండా ఆపారు. పంటకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించి తమ కుటుంబాలను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
Read Also..