అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గo లో మిచౌంగ్ తుఫాను తీరం దాటినప్పటి నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో పలు కాలనీలు, రహదారులు నీట మునిగాయి. భారీ వృక్షాలు సైతం ఈదురు గాలులకు నేలకొరగడం వల్ల విద్యుత్ స్తంభాలు రోడ్డుకు అడ్డంగా పడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే ఈ వర్ష ప్రభావంతో కోత దశకు వచ్చిన వరిచేలు ముంపు నీటిలో నానుతూ చెరువులను తలపిస్తున్నాయి. కోసిన ధాన్యం కల్లాల్లోనే ఉండి పోవడంతో వర్షానికి నీరు చేరి ధాన్యం మొత్తం నీటి పాలయ్యిందని రైతు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మిచౌంగ్ తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత ఆరుగాలాలు కష్టించి పండించిన పంట చేతికి అందివచ్చేసరికి తుఫాను రూపంలో నాశనం చేసిందని రైతులు వాపోతున్నారు. తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని తడిచిన ధాన్యాన్ని ఆర్బికే కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also..
Read Also..