ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. సబ్స్టేషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారికి కష్టాలు తీరనున్నాయని…నేడు ప్రారంభించిన సబ్స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం వెల్లడించారు. రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం జగన్ వర్చువల్ విధానంలో 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ…దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతం అవుతోంది. 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం..కొన్నింటి పనులు ప్రారంభిస్తాం. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్పురం, ఎటపాక తదితర ప్రాంతాల్లో ఇటీవలే తిరిగినప్పుడు సబ్స్టేషన్లే లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి వారు చెప్పారు. అక్కడ సబ్స్టేషన్లను ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. 12 సబ్స్టేషన్లను ప్రారంభిస్తున్నాం….16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు.
Read Also..