గుంటూరు జిల్లా పొన్నూరులో సామాజిక యాత్ర పేరుతో అధికార పార్టీ ప్రభుత్వ దుర్వినియోగానికి పాల్పడుతుందని, అధికారులను బెదిరించి మా కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని చెప్పి హుకుం జారీ చేసిందని టిడిపి సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలంటే 100 పరిమిషన్లు తీసుకోవాలని విమర్శించారు. వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం మీద, ఇసుక మీద చాలా దోచుకుంటున్నారన్నారు. నందిగామలో ముగ్గురు చిన్నారులు చనిపోయారని దానికి వైసిపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొన్నూరు నియోజకవర్గం లో 8,000 పెన్షన్లు తీసేసారన్నారు. కొత్తగా ఇచ్చిన పెన్షన్లు ఏమీ లేవన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోచుకుంటాడు ఇక్కడ మన ఎమ్మెల్యే దోచుకుంటాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తిరుపతిని ఎలా కబ్జా చేశాడో, మన పొన్నూరు ఎమ్మెల్యే గుళ్లను అలా కబ్జా చేశాడన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో ఏ పోస్టింగ్ కి రావాలన్న కప్పం కట్టాల్సిందే అని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదాయం నెలకు 20 లక్షలన్నారు. 5లక్షల నుంచి 6 లక్షలు రేషన్ మాఫియా నుండి వసూలు చేస్తున్నాడన్నారు. బస్సు యాత్రకు వచ్చే నాయకులకు, మంత్రులకు సిగ్గుండాలన్నారు. సీఎం ఆఫీస్ ఐడి కార్డులు పెట్టుకొని గ్రావెల్ అమ్ముకొని ఈ ప్రభుత్వం 500 కోట్లు దోపిడీ చేశారన్నారు. బస్సు యాత్రకు డ్వాక్రా, వాలంటీర్నీ తరలించాలని అధికారులను బెదిరిస్తున్నారని విమర్శించారు పొన్నూరు నియోజకవర్గంలో ఆగిపోయిన అభివృద్ధి మీద సమాధానం చెప్పి వెళ్లాలని కోరుకుంటున్నాను అంటూ ధూళిపాళ్ల ముగించారు.
Read Also..