గన్నవరం కమ్యూనిటీ హాల్ లో ఎయిడ్స్(HIV/AIDS) నిర్మూలనపై మీటింగ్
గన్నవరం, ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. గన్నవరం బీసీ కమ్యూనిటీ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(AP AIDS control agency) మరియు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ నివారణ సంస్థల వారి సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో గన్నవరం కమ్యూనిటీ హాల్ నందు పి ఎల్ హెచ్ ఐ వి కోఆర్డినేషన్ నెట్వర్క్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
ఈ కార్యక్రమంలో గన్నవరం పి హెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాహినా, డాక్టర్ కీర్తి పాల్గొని హెచ్ఐవి పేషెంట్లు ఏఆర్టి మందులు(HIV AIDS Medicine) క్రమం తప్పకుండా వాడాలని తెలియ చేశారు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తులను ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిడి ఫోర్ వైరల్ లోడ్ టెస్ట్ తప్పనిసరిగా చేయించాలని అన్నారు, ఈ కార్యక్రమంలోఐ సి టి సి కౌన్సిలర్ రాజశేఖర్ , చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీరామ్ శ్రీనివాస్ కళ్యాణ్ , మాట్లాడుతూ పి ఎల్ హెచ్ ఐ వి లను ప్రేమతో ఆదరించాలని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో 40 మంది పి ఎల్ హెచ్ఐవి లకు వన్ వే మిషన్ పొట్టిపాడు సంస్థకు చెందిన శ్రీమతి స్వర్ణ జోయల్ కొడాలి న్యూట్రిషన్ సపోర్ట్ చేయడం జరిగింది, చైల్డ్ పాండ్ ఇండియా లింక్ వర్కర్ స్కీమ్ జిల్లా రిసోర్స్ పర్సన్ లక్ష్మీ నాయక్ పోలిమెట్ల జయరాజు ,రిటైర్డ్ పారామెడికల్ ఆఫీసర్ జోనల్ సూపర్వైజర్లు లింక్ వర్కర్లు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి