నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానము, భక్తులతో పోటెత్తింది,, వేలాదిగా భక్తులు తరలిరావటంతో స్వామివారి ఆలయంలో కీ లైన్లు భక్తులతో కిక్కిరిస్తాయి.. తొలియతశాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు నాగులచవితి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించినారు.. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి గాంచిన శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సింహాద్రి రమేష్ బాబు కుటుంబ సమేతంగా విచ్చేసినారు.. నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తొలుత ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం శ్రీ స్వామి వారిని దర్శించుకొనగా, ఆలయ పండితులు వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు..
సింహాద్రి రమేష్ బాబు వారి కుటుంబ సభ్యులను ఆలయ సహాయ కమీషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆలయ మర్యాదలతో సన్మానించారు. ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన లడ్డు కౌంటర్లను ప్రారంభించినారు. మెడికల్ క్యాంపులను స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.. నాగుల చవితి సందర్భంగా ఉదయం 2.30 ని”లు నుంచి భక్తులు స్వామివారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు రేపు ఉదయం 2 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్న ఆలయ అర్చకులు. నాగుల చవితి సందర్భంగా ఆలయంలో నిర్వహించే ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన ఆలయ అధికారులు స్వామివారిని దర్శించేందుకు సుమారు లక్ష మంది భక్తులు వరకు రావచ్చు అని అంచనా.. దర్శనానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సహాయ కమీషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బందోబస్తు నిర్వహించనున్న అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధి పోలీస్ వారు మరియు రెవెన్యూ సిబ్బంది మెడికల్ సిబ్బంది పంచాయతీ వారు సెక్యూరిటీ సిబ్బంది సేవాసమితి వారు వారి యొక్క సేవలను కొనసాగిస్తున్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్న ఆర్టీసీ అధికారులు.
Read Also..