కర్నూలు నగరంలో ప్రభుత్వ సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి(Kurnool Government Hospital) సిబ్బంది నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ క్లీన్ చేస్తుండగా హెచ్ఓడీ గదిలోకి మూగ చెవుడు గల ఐదేళ్ల బాలుడు సుదిత వెళ్లాడు. అది గమనించని ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ థియేటర్ గది తలుపులు వేసి తాళం వేశారు. దీంతో ఆ బాలుడు 21 గంటల పాటు ఆ గదిలోనే నరకయాతన అనుభవించాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
గదిలో ఉన్న ఫ్రిజ్లోని నీరు తాగి కడుపు నింపుకున్నాడు. మరోవైపు తమ కుమారుడు కనిపించడం లేదని బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆపరేషన్ థియేటర్ గది శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపులు తీశారు. కనిపించకుండా పోయిన బాలుడు గదిలో కనిపించడంతో సిబ్బంది అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే వార్డు సిబ్బంది నిర్లక్ష్యం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి