తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి(Anaparthi) నియోజకవర్గం …
నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) ఇంటి వద్ద ఉద్రిక్తత, నల్లమిల్లికి సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తల ఆగ్రహం.. ఇద్దరు కార్యకర్తలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నం.. ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కార్యకర్తలు సమయమును పాటించాలని చెప్పి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి. అధిష్టానంతో మాట్లాడతాను అప్పుడు దాకా వేచి ఉండాలని కోరిన రామకృష్ణారెడ్డి. నల్లమిల్లికి సీటు ఇవ్వకపోతే రాజీనామాలకు సిద్ధమంటున్న టీడీపీ నేతలు.. ఇక్కడ సీటు రామకృష్ణారెడ్డికి ఇవ్వకపోతే వైసిపి గెలుపు ఖాయం అంటున్న టీడీపీ నేతలు. కనీసం లక్ష ఓట్ల మెజారిటీతో సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలుపు తథ్యం అంటున్న టిడిపి కార్యకర్తలు.
Follow us on: Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రేపు ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న టీడీపీ శ్రేణులు. రేపు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతాను అంటున్న రామకృష్ణారెడ్డి.. అధిష్టానం నిర్ణయం .. కార్యకర్తల అభిప్రాయం నాకు రెండు సమానమే అంటున్న రామకృష్ణారెడ్డి.. ఒకసారి మాట్లాడి నా అభిప్రాయాన్ని చెబుతా అంటున్న రామకృష్ణారెడ్డి. కార్యకర్తలు ఎవరు తొందరపడొద్దు.. మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటున్న రామకృష్ణారెడ్డి. కూటమి అధికారంలోకి రావాలంటే ఇక్కడ సీటు కచ్చితంగా రామకృష్ణారెడ్డికే ఇవ్వాలని టిడిపి కార్యకర్తల డిమాండ్. అంతిమ నిర్ణయాన్ని రామకృష్ణారెడ్డికి వదిలేసిన టీడీపీ కార్యకర్తలు. కానీ తమ ఉద్యమం కొనసాగుతుంది అంటున్న టీడీపీ కార్యకర్తలు.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి