ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్లో 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్సై డి. రామకృష్ణ పట్టుబడ్డారు. ఈ సందర్భమగా ఏసీబీ డిఎస్పి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శి పట్టణానికి చెందిన అడ్వాకేట్ శేషం రమణయ్య, ఆయన తమ్ముడు 2022 లో ఒక మర్డర్ కేసులో నిందితులుగా వున్నారు. వీరిపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారు. ఆ రౌడీషీట్ క్లోజింగ్ కోసం 2023 లో అన్నదమ్ములిద్దరూ హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కౌంటర్ ఫైల్ కోసం జిల్లా ఎస్పీ కి నోటీసులు జారీ చేయగా జిల్లా ఎస్పీ.. దర్శి స్టేషన్ ఎస్ఐ ని కౌంటర్ పైల్ కోసం దర్యాప్తు చేసి ఫైల్ దాఖలుకు ఆదేశించగా కౌంటర్ ఫైల్ క్లీన్ చిట్ కోసం నిందితులను 20,000/- ఇస్తే చేస్తానని దర్శి ఎస్సై చెప్పడం, దీనికి వారు ఇష్టపడక జనవరి ఒకటి న ఒంగోలు ఏసీబీని కలిసి తమ గోడు చెప్పుకోగా, ఏసీబీ వారు ఎఫ్ ఐ ఆర్ బుక్ చేసి ప్లాన్ ప్రకారం ఈరోజు దర్శి లో రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ వారు దాడి చేసి పట్టుకోవడం జరిగింది. ఎస్సై ని అరెస్టు చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టు లో హాజరుపరచనున్నారని, ఏసీబీ డీఎస్పీ వి. శ్రీనివాసరావు తెలిపారు.
లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ఎస్.ఐ..
49
previous post