76
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని రైతు భరోసా కేంద్రంలో సోమవారం వ్యవసాయ అధికారి ముస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో రైతులకు భూసార పరీక్ష ఫలితాలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి రైతు తన భూమి మట్టిని పరీక్ష చేయించాలని తద్వారా తక్కువ ఉన్న జింకు వంటి ఖనిజాలను అందించడం ద్వారా దిగుబడి బాగా పెరుగుతుందని రైతులకు తెలియజేశారు. అలాగే భూసార నిమిత్తం పొలంలోని మట్టిని ఎలా సేకరించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పిడి మద్ధిలేటి, ఏడిఏ వెంకటరాముడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులు పంట సాగుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.