పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం గుణ్ణం ఫంక్షన్ హాల్ సమీపంలోని జీవీ అకాడమీ అద్వర్యంలో ఆదిత్య విద్యా నికేతన్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న సూరత్ సాయి తేజేస్వి(11) ఇచ్చిన ప్రశ్నల్లో కొన్ని అప్పగించలేదనే నెపంతో విచక్షణా రహితంగా స్కూల్ టీచర్ వరుణ్ చితకబాదాడు. ఆ విద్యార్థిని ఎడమ బొటన వేలు పై తీవ్ర గాయం కాగా, వీపు పైన, మిగిలిన చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ఇదేమని అడిగిన విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులపై దారుణ పదజాలంతో స్కూల్ చైర్మన్ అండ్ కరస్పాండెంట్ గోపీచంద్ దూషించారు. మేము మీ అమ్మాయినే కాదు, అందరినీ అలానే కొడతాం, టీసీ ఇచ్చేస్తం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ స్కూల్ చైర్మన్ హడావుడి చేసి హంగామా సృష్టించారు. బాధ్యుడైన స్కూల్ టీచర్ అరుణ్, పాఠశాల చైర్మన్ గోపీచంద్ ల పై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేశారు. విద్యార్థిని తల్లిదండ్రులు చైల్డ్ హెల్ప్ లైన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి హింసాత్మక కార్యకలాపాలు చేస్తున్న జీవీ అకాడమీ స్కూల్ ఆదిత్యా విద్యా నికేతన్ లైసెన్స్ రద్దు చేసి బాధ్యులైన స్కూల్ యాజ్మమాన్యం పై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also..