అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు, స్వామి వారి లిప్తపాటు దర్శనం తో జన్మ ధన్యమైందని భక్తులు భావిస్తారు. విశేష పర్వదినాలలో స్వామివారిని చూసి తరించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల కు భక్తులు విశేషంగా వచ్చారు స్వామి వారి దర్శనం తో పాటు ఆలయంలోనూ వెలుపల ప్రత్యేక అలంకరణలు భక్తులను మంత్రముగ్ధులు చేశాయి. ఉద్యానవన విభాగం ఏర్పాటుచేసిన నమూనా ఆలయం అందరిని తన్మయత్వానికి గురిచేశాయి. శ్రీవారి ఆలయం మరియు ఆలయం వెలుపల పుష్పాలంకరణ భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ పర్యాయం 10 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, లక్ష కట్ ఫ్లవర్స్ తో అద్భుతమైన అలంకరణలను చేశారు. ముఖ్యంగా ఆలయం లోపల పుష్పాలతో ఏర్పాటు చేసిన దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. మరోవైపు స్వామివారిని దర్శించుకొలేని భక్తుల కోసం ఆలయం వెలుపల శ్రీరంగం శ్రీ రంగనాధ స్వామిని ప్రతిబింబించేలా తీర్చిదిద్దిన నమూనా భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
మంత్రముగ్ధులను చేస్తున్న స్వామి వారి అలంకరణ
64
previous post