పూర్వం పరశురాముడు తన తండ్రి ఆజ్ఞమేరకు తల్లినే సంహరిస్తాడు. అయితే తీవ్ర బాధతో కుంగిపోతున్న పరశురాముడు తిరిగి తన తండ్రి ఇచ్చిన వరంతో తల్లిని బ్రతికించుకుంటాడు. కానీ తల్లిని చంపినందుకు తీవ్ర అవమానభారంతో బాధపడుతూ ప్రాయశ్చితం చేయడంకోసం ఋషులు దగ్గరకు వెళతాడు. అతగాడు ఋషులు ఇచ్చిన సలహాను అనుసరించి శివుణ్ని ఆరాధించడానికి బయలుదేరుతాడు. అలా ప్రయాణిస్తున్న తన మార్గంలోనే ఒక అడవి మధ్యలో ఈ శివలింగాన్ని దర్శించాడు. అలా దర్శించుకున్న అతను ఈ ప్రాంతంలోనే ఒక సరోవరాన్ని నిర్మించుకుని దాని ఒడ్డునే తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ సరోవరంలో రోజుకు ఒక్క పుష్పం మాత్రమే పూసేది. దానిని తీసుకుని శంకరునికి పూజాసమయంలో పరశురాముడు సమర్పించేవాడు. ఆ పుష్పాన్ని అడవి జంతువులనుంచి కాపాడుకోవడానికి చిత్రసేనుడనే ఒక యక్షుడిని కాపలాగా నియమించాడు. దానికి బదులుగా ప్రతిరోజు ఒక జంతువును, కొంత పానీయాన్ని ఇవ్వడానికి పరశురాముడు ఆ యక్షునితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఆలయ వివరాలు :
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో ఒక చారిత్రాత్మకంగా ప్రాముఖ్యం చెందిన ఒక ఏర్పేడు గ్రామం వుంది. ఈ గ్రామంలో పూర్వం ఆంధ్రశాతవాహనుల కాలంనాటి పురాతన శివాలయం వుంది. పురాతన శాసనాల ప్రకారం ఈ ఆలయం క్రీ.శ. 2వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. క్రీ.శ. 1973లో జరిపిన తవ్వకాలలో బయటపడిన ఈ ఆలయాన్ని జాతీయసంపదగా గుర్తించారు. ఈ దేవాలయాన్ని కొంతకాలం వరకు చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు. ఆ తరువాతి కాలంలో ముస్లిం పాలకులు ఆ చంద్రగిరిరాజుల సంస్థానంతోపాటు ఈ దేవాలయాన్ని కూడా చాలావరకు ధ్వంసం చేశారు. అయితే మూలవిరాట్ స్వామికి మాత్రం ఎటువంటి హాని కలుగలేదు. ఈ ఆలయ గర్భాలయంలో ప్రతిష్టించబడిన శివలింగం లింగరూపంలో కాకుండా మానవరూపంలో మహావీరుడైన వేటగాని రూపంలో శివుడు కొలువై వున్నాడు. లింగం సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు వుంటుంది. ఈ ఆలయం పశ్చామాభిముఖంగా వుంటుంది. తవ్వకాల్లో లభించిన కొన్ని ఆధారాల ప్రకారం 12వ శతాబ్దలో విక్రమచోళుడి కాలంలో ఈ ఆలయం పునర్మించబడిందని తెలుస్తోంది. చోళుల తర్వాత పల్లవులు కొంతకాలం వరకు ఈ ఆలయానికి నిర్వహణ కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ ఆలయంలోని లింగాలను ఎవరు, ఎప్పుడు, ఎలా నిర్మించారోనన్న ఆధారాలు, సమాచారం తెలియరాలేదు. ఈ ఆలయంలో వున్న లింగాకారం మరే ఆలయంలో లేనివిధంగా పురుషాంగాన్ని పోలి వుంటుంది. దానిమీద రాక్షసుడి భుజాలపై నిలబడిన శివమూర్తి వుంటుంది. చోళ శాసనాల్లో ఈ ప్రాంతాన్ని తిరువిప్పరమ్ బేడు, పల్లవుల కాలంలో గుడిపల్లంగా పిలవబడింది. కాలక్రమంలో రానురాను అది గుడిమల్లంగా మారి.. ఆలయం చుట్టూ ఒక చిన్న గ్రామం ఏర్పడిపోయింది.
గుడిమల్లం శివాలయం
86
previous post