సాధారణంగా ఉప్పు ఎక్కువగా తింటే బీపీ వస్తుందని చెబుతారు వైద్యులు. కొందరైతే.. అసలు ఉప్పే వాడొద్దు అంటారు. కానీ తాజా పరిశోధనల్లో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ఉప్పు ఎక్కువైతే.. షుగర్ వస్తుంది అంట. ఆ వివరాలు..
ఉప్పు ఎక్కువగా తింటే మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. మీకు డయాబెటిస్ లేకపోయినా.. మూత్ర విసరర్జన ఎక్కువగా అవుతుంటే.. మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవాలి.
ఉప్పు బాగా తింటే నాలుకపై ఉండే రుచి కళికలు ఇతర రుచులను గుర్తించలేవు. ఫలితంగా ఏది తిన్నా అంతగా రుచించదు. ఈ సమస్య ఉంటే మీరు ఉప్పు ఎక్కువగా తింటున్నారని అర్థం చేసుకోవచ్చు.
ఉప్పు ఎక్కువగా తినేవారి శరీరంలో నీటి శాతం త్వరగా అయిపోతుంది. ఫలితంగా డీహైడ్రేషన్ బారిన పడి తలనొప్పి, నీరసం వస్తుంది. కావున మీరు ఈ సమస్యల నుంచి బయటపడాలంటే.. ఉప్పును తగ్గించుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.