తేనెను చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు. సహజంగా లభించే తేనె రుచికే కాదు ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది. దానికి కొన్ని పదార్థాలను జోడించి తరచూ తాగడం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పాలతో ఒక కప్పు వేడి పాలలో, చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారవుతారు. కడుపులో క్రిములను, పుండ్లను తగ్గించడానికి, రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషధం. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. నోటి పొక్కులకు: రెండు చెంచాల తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం, చిటికెడు ఉప్పు బాగా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోట్లో పొక్కులు, దుర్వాసన తగ్గుతాయి. తేనె టీ పొద్దున్నే కాఫీ, టీలకు బదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పరగడుపున కప్పు వేణ్నీళ్లలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి. అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం. రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంతో కప్పు వేణ్నీళ్లలో కొంచెం నిమ్మరసం, చెంచా తేనెను బాగా కలపాలి. కాలేయ సమస్యలున్న వాళ్లు దీన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. శరీరం మీద మచ్చలు చాలా తేలిగ్గా తగ్గుతాయి. పడుకునే ముందు తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Read Also..
Read Also..