Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Health ఇంగువ ఔషధ గుణాలు..

ఇంగువ ఔషధ గుణాలు..

by Satya
Here's

ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకం గా ఇది వాడుక లో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారం లో ఇంగువ ముఖ్యమైన పదార్ధం. అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది. జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్‌ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్‌ సమస్య బాధించదు. రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి. నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి. ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది. మానసిక సమస్యలూ, ఒత్తిళ్ల కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికారక హార్మోన్లతో పోరాడే శక్తి ఇంగువలోని పోషకాలకు ఉంది.

Advertisements

You may also like

Our Visitor

039183
Total views : 194589

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: