మన శరీరంలోని వేడికి దోమలు ఆకర్షితం అవుతాయి. దోమలు కుట్టినప్పుడు మనకు చాలా దురదగా ఉంటుంది. వెంటనే మనకు ఆ ప్రాంతంలో గోకాలనిపిస్తుంది. దోమలు రక్తాన్ని తాగేందుకు సూదిలాంటి మొనను మన శరీరంలోకి గుచ్చుతాయి. ఆ సమయంలో అవి మీ చర్మంలోకి లాలాజలాన్ని ఇంజెక్ట్ చేస్తాయి. దీంతో మీ శరీరం లాలాజలానికి ప్రతిస్పందిస్తుంది. ఫలితంగా అక్కడ గడ్డలా ఏర్పడుతుంది. దురద వస్తుంది. కొందరికి కాటుకు తేలికపాటి ప్రతిచర్యలు మాత్రమే ఉంటుంది. కొందరికి మాత్రం ఆ నొప్పి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ ప్రాంతం ఎర్రగా మారడం, పుండ్లు పడటం లేదా వాపుగా మారడం చూస్తుంటాం. దోమ వల్ల కలిగే దురద చాలా ఇబ్బంది కలిగిస్తుంది. చికాకుగా ఉంటుంది. పదే పదే గోక్కోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో ఏ పని చేయలేం. చాలా చికాకు వస్తుంది. దురద పెట్టిన చోట చేతులు పెట్టి మరో చోట తాకితే అక్కడ కూడా దురద ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు ఇంటి చిట్కాలతో దురద నుంచి ఉపశమనం పొందవచ్చు. దోమ కాటు వేసిన చోట కలబంద, టూత్ పేస్ట్, తేనె, మంచు, ఏదైనా తైలం, మంచు, అరటి తొక్క వంటివి రాస్తే దురద తగ్గుతుంది.
honey
తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ , మోల్ట్స్ వంటి వాటిని ఎదగనివ్వదు. ఇందులోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని ఇస్తాయి. చిన్న చిన్న గాయాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది. గొంతులో గరగరలను తగ్గిస్తుంది. నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును, తేనేలో కార్బోహైడ్రేట్లు, నీరు, మినరల్స , విటమిన్స వుంటాయి. కాల్షియమ్, మాంగనీస్, పోటాషియమ్,ఫాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి. తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కీళ్ళనోప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనే, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చిన చెక్క పోడి తీసుకొండి. ఆమిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధిం చే భాగం మీద మర్ధన చేస్తే మర్ధన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది. రెండు స్పూన్ల తేనేలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి, జీర్ణం సులభం చేస్తుంది. తేనే ,దాల్చిన చెక్క పొడిని బ్రెడ్ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్ తగ్గుతుంది. రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్ రానివ్వదు. వేడినీటిలో ఒక స్పూన్ తేనే, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది. తేనే లో ఉన్నా విటమిన్స్ శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును, యాన్తి బ్యాక్తెరియాల్, యాన్తి సెప్టిక్ గునాలున్నందున చర్మము పై పూసిన గాయాలు మానును. రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది. రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తూన్ది. నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది. తేనే లో కొచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచం శనగపిండి కలుపుకొని ముఖంనికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది. తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి.
Read Also..
Read Also..
తేనెను చూస్తే ఎవరికి మాత్రం నోరూరదు. సహజంగా లభించే తేనె రుచికే కాదు ఆరోగ్యాన్ని అందించడంలోనూ ముందుంటుంది. దానికి కొన్ని పదార్థాలను జోడించి తరచూ తాగడం అలవాటు చేసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. పాలతో ఒక కప్పు వేడి పాలలో, చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయారవుతారు. కడుపులో క్రిములను, పుండ్లను తగ్గించడానికి, రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషధం. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. నోటి పొక్కులకు: రెండు చెంచాల తేనె, నాలుగు చెంచాల నిమ్మరసం, చిటికెడు ఉప్పు బాగా కలిపి నోట్లో వేసుకుని పుక్కిలించాలి. ఇలా చేస్తే నోట్లో పొక్కులు, దుర్వాసన తగ్గుతాయి. తేనె టీ పొద్దున్నే కాఫీ, టీలకు బదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పరగడుపున కప్పు వేణ్నీళ్లలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి. అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం. రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది. నిమ్మరసంతో కప్పు వేణ్నీళ్లలో కొంచెం నిమ్మరసం, చెంచా తేనెను బాగా కలపాలి. కాలేయ సమస్యలున్న వాళ్లు దీన్ని తాగితే మంచి ఫలితాలుంటాయి. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. శరీరం మీద మచ్చలు చాలా తేలిగ్గా తగ్గుతాయి. పడుకునే ముందు తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
Read Also..
Read Also..





Total views : 78021