Health Tips:
యాలకుల(Cardamom)లో సుగంధ ద్రవ్యాలు ఉండటంవల్ల ఆహారానికి రుచి వస్తుంది. నోరు వాసన వస్తుంటే యాలకులు నమిలితే మంచి ఫ్రెష్ నర్ గా పనిచేస్తుంది. ఊబకాయంతో బాధపడేవారు రాత్రివేళ గోరువెచ్చని నీళ్లతో కలిపి వీటిని సేవించడంవల్ల బరువు తగ్గుతారు. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరచడమే కాకుండా రక్తపోటు నుంచి, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
రాత్రి పడుకునే ముందు ఈ జ్యూస్ తాగితే చాలు తెల్లగా మెరిసిపోతారు..
ఇవి చెడు కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తాయి. జుట్టు రాలిపోతుందని రోజూ బాధపడేవారు యాలకులను తీసుకోవాలి. చర్మంపై ఉండే నల్ల మచ్చలను తగ్గించడంలో కూడా యాలకులు సహాయపడతాయి. కిడ్నీలోని మలినాలను బయటకు పంపుతాయి. అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొనేవారు యాలకులు తినాలి. జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో వీటి పాత్ర గణనీయంగా ఉంటుంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.