వేసవి(Summer)లో ఐస్ వాటర్(Ice Water) తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చు. ఐస్ వాటర్ తాగడం వల్ల కొంతమందిలో గొంతులోని రక్తనాళాలపై ప్రభావం పడుతుంది. ఐస్ వాటర్ తరచూ తాగితే హృదయ స్పందన రేటు తగ్గుతుంది. ఈ ప్రభావం కార్నియల్ నరాల యాక్టివేట్‌కు దారితీయవచ్చు. ఫలితంగా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కోల్డ్ వాటర్ అదేపనిగా తాగితే దంతాల సున్నితత్వం పెరుగుతుంది. దంతాల పనితీరు మందగించి ఆహారం నమలడం కష్టంగా మారవచ్చు.
ఇది చదవండి:ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా..!
కూల్ కేక్స్(Cool Cakes), ఐస్‌క్రీమ్స్(Ice Creams) వంటివి అతిగా తింటే కూడా దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ముఖ్యంగా దంతాలపై ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. దీంతో దంతక్షయం రిస్క్ పెరుగుతుంది. తినే సమయంలో లేదా తిన్న తర్వాత ఐస్ వాటర్ తాగితే గొంతు నొప్పి, చికాకు దారితీయవచ్చు. ఐస్ వాటర్ తాగితే వెన్నముకలోని నరాలు చల్లబడుతాయి. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. తలనొప్పిని ప్రేరేపిస్తుంది. మైగ్రేన్ ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జలుబుతో బాధపడుతుంటే ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- సీజనల్ వ్యాధులపై ఏపీ సర్కార్ అలర్ట్సీజనల్ ఫీవర్స్, ఫుడ్ పాయిజన్ పై ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఈ సందర్భంగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎమర్జెన్సీ కిట్లను తరలించారు. వాటర్ కంటామినేషన్…
- సమయానికి అందుబాటులో లేని డాక్టర్లువికారాబాద్ జిల్లా తాండూర్‌లో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేషంట్స్ అసహనం వ్యక్తం చేశారు. సమయానికి సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని అన్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ఓపీ టైంకు అందుబాటులో ఉండడం…
- మంకీ పాక్స్‌పై మార్గదర్శకాలు జారీ చేసిన ఎయిమ్స్ప్రపంచాన్ని వణికిస్తోన్న మంకీ పాక్స్‌పై ఢిల్లీ ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. అనుమానిత, ధృవీకరించిన కేసుల కోసం ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని లోక్ నాయక్, జీటీబీ, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రులను ఆదేశించింది. అయితే మంకీపాక్స్…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి