Health Tips:
ధూమపానం కేవలం శ్వాసకోశ సమస్యలు(Respiratory problems), గుండె సమస్యలు(Reart problems), క్యాన్సర్(Cancer) ముప్పును మాత్రమే పెంచుతుందని మనకు తెలుసు. కంటి సమస్య ముప్పు కూడా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. స్మోకింగ్, దృష్టి లోపానికి మధ్య ఉన్న సంబంధం ఆందోళన కలిగించే విషయం అని అంటున్నారు. మన ఆరోగ్య శ్రేయస్సు కోసం ధూమపానానికి మొత్తం దూరంగా ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు. స్మోకింగ్ కంటిశుక్లాలు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమస్య ఉంటే.. కంటి గుడ్డులో మబ్బుగా కన్పించడం, అస్పష్టమైన దృష్టి , ఒక వస్తువు రెండుగా కన్పించడం, కంటిలో తెల్లగా కన్పించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. స్మోకింగ్ చేయనివారితో పోలిస్తే.. స్మోకింగ్ చేసేవారిలో కంటిశుక్లాలు వచ్చే అవకాశం రెండు నుంచి మూడ రెట్లు ఎక్కువగా ఉంటుంది. కంటిశుక్లం.. కాకుండా కాంట్రాస్ట్ సెన్సిటివిటీని కూడా తగ్గిస్తుంది. రాత్రిపూట చూపు సరిగ్గా ఉండదు. స్మోకింగ్కు దూరంగా ఉంటే.. కంటిశుక్లం వచ్చే ముప్పును తగ్గించవచ్చు.
Follow us on :Facebook, Instagram, YouTube & Google News
ఇదిచదవండి : Almonds : రోజూ బాదం తింటే ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి