నిజానికి చెమట(Sweat) పట్టడం మంచిదే. ఇది శరీర ఉష్ణోగ్రత(Temperature)ను నియంత్రించే ఒక మార్గం. కానీ ఒక స్థాయి దాటితే అధిక చెమట చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. చెడు వాసన, దురద, చికాకు కలిగిస్తుంది. దుస్తులపై తెల్లటి చారల రూపంలో మరకలు కనిపిస్తాయి. అయితే వేసవిలో చెమట ఎక్కువగా పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించవచ్చు. వేసవిలో తీవ్రమైన వేడి తాపం నుంచి ఉపశమనం కోసం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. మంచినీటితో పాటు మజ్జిగ, హెల్తీ డ్రింక్స్(Healthy drinks) తరచుగా తాగాలి. హైడ్రేట్‌గా ఉంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో చెమట ఎక్కువగా రాదు. వేసవిలో సరిగా నీళ్లుగా తాగకపోతే శరీరం డీహైడ్రేషన్(Dehydration) బారిన పడి, వడదెబ్బ తగలవచ్చు. ఏవైనా పనులు చేస్తే చెమట మరింత ఎక్కువ అవుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే సమ్మర్లో కనీసం రోజుకు రెండుసార్లు చల్లని నీటితో స్నానం చేయాలి. ఉదయం, సాయంత్రం స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో చెమట ఎక్కువగా పట్టదు. చెమట తీవ్రతను తగ్గించుకోవాలంటే గాలి బాగా ప్రసరించే కాటన్ దుస్తులు ధరించాలి.
ఇది చదవండి: పుచ్చకాయ గింజలతో ఎన్ని లాభాలో తెలుసా..?
బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ మంచి వెంటిలేషన్‌తో సౌకర్యంగా ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత పెరగకుండా చల్లదనాన్ని ఇస్తాయి. దీంతో చెమట అతిగా పట్టదు. వేసవిలో ధరించే దుస్తులు తేలికపాటి రంగుల్లో ఉండాలి. ఇవి సూర్యకిరణాలను గ్రహించకుండా వాటిని రిఫ్లెక్ట్ చేస్తాయి. శరీరాన్ని పొడిగా ఉంచుకోవాలంటే సమ్మర్లో పౌడర్ వాడాలి. ఇది చెమటను తగ్గిస్తుంది. అండర్ ఆర్మ్ ప్రదేశాల్లో పట్టే చెమటను పౌడర్ గ్రహిస్తుంది. ఇది మంచి సువాసన అందించి చర్మానికి చల్లదనాన్ని, మృదుత్వాన్ని ఇస్తుంది. యాంటీ పెర్స్పిరెంట్ స్ప్రేలు చెమటను తగ్గించగలవు. ఇవి శరీరం నుంచి దుర్వాసన రాకుండా నిరోధిస్తాయి. అందుకే వేసవిలో ఈ స్ప్రేలను వాడితే ఫలితం ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన కారణంగా శరీరంలో చెమట గ్రంథులు యాక్టివేట్ అవుతాయి. దీంతో శరీరమంతా తీవ్రమైన చెమట పడుతుంది. ఈ పరిస్థితి చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది. వేసవిలో చెమట తీవ్రతను తగ్గించాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి. ఒత్తిడికి గురికాకుడదు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.