Overthinking Impact:
చాలామంది ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందితే ఆ ప్రభావం శారీరకంగాను, మానసికంగాను పడుతుందని, అది అనారోగ్యాలకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల అలాంటివారికి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా నిద్రలేమి సమస్యలు, మానసిక ఆందోళన, రక్తపోటు సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మెదడు కణాలపై ఒత్తిడి పెరగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు చాలాకాలం పాటు కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇది చదవండి: నల్ల మిరియాల్లో కలిగే లాభాలు.. తప్పక తెలుసుకోండి!
శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు రకరకాల రోగాలు మన పైన ఎటాక్ చేసే అవకాశం ఉంటుందని, చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుండి దీర్ఘకాలిక వ్యాధుల వరకు మనల్ని టార్గెట్ చేసి మన ఆరోగ్యాన్ని మరింత దిగజార్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచించే వారిలో చర్మ సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని, టెన్షన్ చర్మ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుందని చెబుతున్నారు శరీరంలో క్యాన్సర్ కణాలు పెరిగే ప్రమాదం ఉందని, అతిగా ఆలోచించడం వల్ల శరీరంలో జరిగే మార్పులతో క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందుకే అతిగా ఆలోచించటం మానుకుని, సమయానుకూలంగా పనులు చేసుకోవాలి.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి