ఖర్జూరంలో కాల్షియం, మినరల్స్, ఐరన్, ఫాస్పరస్, అమినో యాసిడ్స్ వంటివి అధికంగా ఉంటాయి. ఇంకా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. ఖర్జూరం తింటే జలుబు, దగ్గు రావు. శీతాకాలంలో జలుబు, దగ్గు చేయడం సహజం. అయితే రోజుకు రెండుకానీ మూడుకానీ ఖర్జూరాలను పాలల్లో కలిపి తీసుకుంటే వీటినుంచి ఉపశమనం పొందొచ్చు. జీర్ణక్రియ కూడా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది. తరుచుగా మలబద్దకంతో బాధపడేవారు వీటిని తీసుకోవాలి. వీటిల్లో అధిక మొత్తంలో పీచు లభిస్తుంది. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఈ కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణమయ్యాయి. ఖర్జూరాన్ని ప్రతిరోజూ తీసుకోవడంద్వారా కొంత ప్రయోజనం పొందొచ్చు. ఖర్జూరంలో కాల్షియం, సెలీనియం, మాంగనీస్ మొదలైన పోషకాలుంటాయి. ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. బరువు పెరగకపోతుంటే ప్రతిరోజు శీతాకాలంలోప్రతిరోజు ఖర్జూరం తినాలి. దీనివల్ల బరువు వేగంగా పెరుగుతారు. అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఖర్జూరం వల్ల ఇంకా ఎన్నో అనారోగ్యాలు నయమవుతాయి.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.