అమెరికా – ఇరాన్ శాంతి చర్చల్లో పురోగతి..

Advertisements

<p>అమెరికాతో ఇరాన్ ఒప్పందం ఇప్పట్లో కుదురుతుందా&&num;8230&semi; ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లలో నానుతున్న ప్రశ్న&period; త్వరలోనే డీల్‌ ఓకే అవుతుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటిస్తున్నప్పటికీ&&num;8230&semi; అందరిలోనూ ఏదో తెలియని సందేహాలు&period; నోటితో నవ్వి&period;&period; నొసటితో వెక్కిరించినట్లు ఉన్న ట్రంప్‌ వ్యవహారమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు&period; అయితే గతంతో పోల్చితే&&num;8230&semi; ఇరాన్‌- అమెరికా చర్చల ప్రక్రియలో కొంత పురోగతి ఉన్నట్లు మాత్రం తెలుస్తోంది&period; చాలా కాలంగా అమెరికా డిమాండ్‌ చేస్తున్నట్లుగా&&num;8230&semi; తమ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోడానికి ఇరాన్ అంగీకరించింది&period; ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌&comma; టెహ్రాన్‌ మధ్య ఒప్పందం కుదరడానికి మార్గం మరింత సుగమం అయిందని అమెరికా అధికారులు చెబుతున్నారు&period; యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించి&period;&period; హర్మూజ్‌ను తిరిగి తెరవడమే లక్ష్యంగా ఇరు దేశాలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు&period; అధికారికంగా ఒప్పందం కుదరగానే యురేనియం నిర్వీర్యం చేసే విధానాలపై చర్చలు జరపనున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>వాస్తవానికి ఇరాన్‌ &&num;8211&semi; ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం తలెత్తడానికి&comma; అందులో అమెరికా జోక్యం చేసుకుని సమస్యను మరింత జఠిలం చేయడానికి ఈ యురేనియం నిల్వలే ప్రధాన కారణంగా చెప్పవచ్చు&period; అంతర్జాతీయ అణుశక్తి సంస్థ లెక్కల ప్రకారం&period;&period; ఆ దేశం దగ్గర 60శాతం శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం నిల్వ ఉంది&period; దీన్ని ఇరాన్‌ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మరింత శుద్ధి చేసి అణ్వస్త్ర తయారీకి వినియోగించుకోవచ్చు&period; ఇదే భయంతో అమెరికా అణు నిరాయుధీకరణ డిమాండ్‌ చేసింది&period; దీనికి ఇరాన్‌ ససేమిరా అనడంతో&period;&period; సంక్షోభం తలెత్తింది&period; అది రానురానూ ముదిరి యుద్ధానికి దారి తీసింది&period; అయితే అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు రెండు దేశాలు చర్చల ప్రక్రియను కొనసాగిస్తుండడంతో&&num;8230&semi; తాత్కాలికంగా ఉద్రిక్తతలు చల్లారాయి&period; ఇప్పుడు చర్చల్లో మరింత పురోగతి రావడం&period;&period; యురేనియం విషయంలో ఇరాన్‌ కాస్త వెనక్కి తగ్గడంతో త్వరలోనే యుద్ధం ముగుస్తుందన్న ఆశలు బలపడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వైసీపీ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది -మంత్రి లోకేష్‌..

శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాల అంశంపై కీలక నిర్ణయం..

తమిళనాడు అన్నాడీఎంకేలో చీలికలు..