ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..

Advertisements

<p>ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్టు ఎందుకు ఫెయిల్ అయ్యింది&quest; హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి రీజన్ ఏంటీ&quest; ఎల్ అండ్ టీ లాంటి పెద్ద సంస్థ ఎందుకు మెట్రో రైల్ ను నడపలేకపోయింది &quest; ప్రభుత్వ పరం అయిన తర్వాత ఎలా నడవనుంది &quest; ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు అందరి మనస్సులలో మెదులుతుంది &period;దీనిపై సీవీఆర్ ప్రత్యేక కధనం<&sol;p>&NewLine;<p>ప్రపంచంలోనే అతి పెద్ద పీపీపీ ప్రాజెక్ట్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రోపై ఇప్పుడు కీలక పరిణామం చోటుచేసుకుంది&period; సంవత్సరాల పాటు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో కొనసాగిన ఈ ప్రాజెక్ట్ కొత్త దశలోకి ప్రవేశించింది&period; నగర ముఖచిత్రాన్ని మార్చిన ఈ మెట్రో సేవలు లక్షలాది మందికి ప్రతి రోజు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి&period; అయితే ఆర్థిక ఒత్తిళ్లు&comma; మారుతున్న పరిస్థితులు&comma; ముఖ్యంగా కోవిడ్ ప్రభావం కారణంగా ఈ ప్రాజెక్ట్‌ నష్టాల బారిన పడిందని ఎల్ అండ్ టీ చెబుతోంది &period; ఇన్నాళ్లు ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఈ మెట్రోను ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవడం కీలక నిర్ణయంగా మారింది&period; దీని ప్రభావం భవిష్యత్ నగర రవాణా రంగంపై ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది&period;<&sol;p>&NewLine;<p>&lpar;&rpar;<br &sol;>&NewLine;హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ ప్రయాణం దాదాపు పదిహేనేళ్ల క్రితం ప్రారంభమైంది&period; మొదట మేటాస్ కన్సార్షియం ఈ టెండర్‌ను దక్కించుకున్నప్పటికీ సత్యం కుంభకోణం తర్వాత అది రద్దయింది&period; అనంతరం జరిగిన రెండో టెండర్లలో ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్ట్‌ను స్వాధీనం చేసుకుంది&period; మొదట అంచనా వేసిన వ్యయం కంటే ఎక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ పూర్తయింది&period; బ్యాంకుల నుంచి భారీ రుణాలు తీసుకుని నిర్మాణం కొనసాగించాల్సి వచ్చింది&period; 2017లో ప్రారంభమైన మెట్రో సేవలు ప్రస్తుతం మూడు కారిడార్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి&period; అయితే ప్రారంభ అంచనాలకు తగ్గట్టుగా ఆదాయం రాకపోవడంతో సంస్థపై ఆర్థిక భారం పెరిగింది &period; దింతో ఎల్ అండ్ టీ కి ఈ ప్రాజెక్టు ను నడపలేని పరిస్థితి నెలకొంది &period;<&sol;p>&NewLine;<p>ప్రాజెక్ట్ ఆర్థిక పరిస్థితులను మరింత క్లిష్టం చేసింది కోవిడ్ మహమ్మారి&period; ఆరు నెలలపాటు మెట్రో సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆదాయం లేకుండా పోయింది&period; కానీ అప్పులపై వడ్డీ భారం మాత్రం తప్పలేదు &period; ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్ తీవ్ర నష్టాల్లోకి వెళ్లింది&period; ప్రభుత్వం అప్పట్లో వడ్డీ లేని రుణాన్ని అందించినప్పటికీ పరిస్థితి పూర్తిగా చక్కబడలేదు&period; ప్రయాణికుల సంఖ్య కూడా ఆశించిన స్థాయిలో పెరగకపోవడం మరో సమస్యగా మారింది&period; దీంతో ప్రాజెక్ట్ నిర్వహణలో ఉన్న ప్రైవేట్ సంస్థకు ఆర్థిక ఒత్తిడి పెరిగింది&period; ఈ నేపథ్యంలో భవిష్యత్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది&period; ఇదే ప్రభుత్వం జోక్యానికి దారితీసింది&period;<&sol;p>&NewLine;<p>ఇప్పటి వరకు ఎల్ని అండ్ టీ నిర్వహణలో ఉన్న మెట్రో ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది&period; ఈ ప్రక్రియలో సంస్థలోని మొత్తం ఈక్విటీని ప్రభుత్వం కొనుగోలు చేసింది&period; అంతేకాకుండా భారీ అప్పులను కూడా తన భుజాలపై వేసుకుంది&period; రెండు దశలు వేర్వేరు సంస్థల చేతుల్లో ఉంటే నిర్వహణలో సమస్యలు వస్తాయని ప్రభుత్వం భావించింది&period; అందుకే ఒకే సంస్థ ఆధ్వర్యంలో మొత్తం మెట్రో వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది&period; ఈ ఒప్పందం ద్వారా ఎల్ అండ్ టీ పూర్తిగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది&period; దీంతో మెట్రో నిర్వహణలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది&period;<&sol;p>&NewLine;<p>ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో రోజుకు లక్షలాది మంది ప్రయాణిస్తున్నారు&period; ఇప్పటి వరకు కోట్ల మంది ప్రయాణాలు కొనసాగించారు &period; నగర రవాణాలో మెట్రో కీలక పాత్ర పోషిస్తోంది&period; ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది&period; ఛార్జీలు&comma; సేవల సమయం&comma; ఇతర సదుపాయాలపై ప్రభుత్వం ప్రత్యక్ష నియంత్రణ కలిగి ఉంటుంది&period; భవిష్యత్‌లో కొత్త లైన్ల నిర్మాణం&comma; పాత కారిడార్ల అనుసంధానం వేగవంతం చేయవచ్చు&period; ఇది నగర అభివృద్ధికి మరింత తోడ్పడే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;<p>హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది&period; ప్రైవేట్ భాగస్వామ్యం నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనానికి మారడం కీలక పరిణామంగా మారింది&period; ఇది ఒకవైపు ఆర్థిక సవాళ్లను సూచిస్తే మరోవైపు అవకాశాలను కల్పించనుందని తెలుస్తుంది &period; సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడవచ్చు&period; భవిష్యత్ నగర ప్రణాళికల్లో మెట్రో కీలక పాత్ర పోషించనుంది&period; ఈ మార్పులు ప్రయాణికులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తాయో చూడాల్సి ఉంది&period; మొత్తంగా ఈ పరిణామం దేశంలోని ఇతర పీపీపీ ప్రాజెక్టులకు కూడా ఒక మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..