భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.

భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం

Advertisements

<p>భారత రక్షణ పరిశోధన&comma; అభివృద్ధి సంస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది&period; పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది&period; ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ఫ్లైట్-టెస్ట్ నిర్వహించారు&period; ఈ ప్రయోగం నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను పూర్తిగా చేరుకుందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది&period; చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ట్రాకింగ్ వ్యవస్థ ద్వారా క్షిపణి గమనాన్ని పర్యవేక్షించినట్లు పేర్కొంది&period; ఈ విజయంతో సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించే భారత సామర్థ్యం మరింత పెరిగినట్లయింది&period; రక్షణ కార్యదర్శి&comma; డీఆర్‌డీఓ ఛైర్మన్ రాజేష్ కుమార్ సింగ్‌తో పాటు భారత నౌకాదళం&comma; వాయుసేనకు చెందిన ఉన్నతాధికారులు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు&period; క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ బృందాన్ని&comma; పరిశ్రమ భాగస్వాములను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు&period; డీఆర్‌డీఓ ప్రయోగశాలలు&comma; భారత పరిశ్రమ భాగస్వాములతో కలిసి ఈ క్షిపణిలోని అన్ని ఉపవ్యవస్థలను దేశీయంగానే అభివృద్ధి చేశాయి&period; బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ నోడల్ లేబొరేటరీగా వ్యవహరించింది&period; ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక ముందడుగు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు&period; రెండు రోజుల క్రితమే డీఆర్‌డీఓ బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ &comma; యాంటీ-షిప్ క్షిపణులను వరుసగా పరీక్షించింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..