స్లోవేకియాలో పర్యటించిన ప్రధాని మోదీ.

భారత ప్రధానికి స్లోవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారం

Advertisements

<p>ప్రధానిమోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది&period; మొదట ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ&period;&period; స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా లో అడుగుపెట్టి &period;&period; ఒక చారిత్రక ఘట్టాన్ని ఆవిష్కరించారు&period; స్లోవేకియాకు 1993లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి&period; బ్రాటిస్లావా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ సంప్రదాయబద్ధంగా &&num;8216&semi;బ్రెడ్ అండ్ సాల్ట్&&num;8217&semi;తో ఘన స్వాగతం పలికారు&period; ఈ పర్యటన భారత్-స్లోవేకియా సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోదీ &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi; వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు&period; ఈ పర్యటనలో భాగంగా మోదీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు&comma; అక్కడి అగ్రశ్రేణి వ్యాపారవేత్తలతో కూడా సమావేశమయ్యారు&period; ప్రస్తుతం ఇరు దేశాల మధ్య 1&period;6 బిలియన్ యూరోల వాణిజ్యం ఉంది&period; భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల నేపథ్యంలో ఈయూ&comma; నాటో సభ్యదేశమైన స్లోవేకియాతో బంధం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది&period; స్లోవేకియా పర్యటన తర్వాత తిరిగి ప్రాన్స్ బయల్దేరిన మోదీ&period;&period; నేడు&comma; రేపు ప్రాన్స్ లో జరిగే జీ7 సదస్సులో పాల్గొంటారు&period; అనంతరం &&num;8216&semi;వివాటెక్ 2026&&num;8217&semi; టెక్నాలజీ ఈవెంట్‌కు హాజరై ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.