శ్రీకాకుళం జిల్లా… ఇచ్చాపురం… అక్టోబర్ 8వ తేదీన ఇచ్చాపురం మండలంలోని నీలాపు పుట్టుక గ్రామంలో గృహిణి నీలాపు మీనా కుమారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను స్వయంగా ఆమె అత్తమామలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, హత్య చేసింది తామే అంటూ పోలీసులకు లొంగిపోయారు. ఈ మేరకు శుక్రవారం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 8వ తేదీన నీలాపు మీనా కుమారి అనుమానాస్పద స్థితిలో తన నివాసంలో మృతి చెందింది. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకుందని అత్తమామలు అప్పుడు పోలీసులకు వివరించారు. అయితే పోలీసులు ఈ మృతిని అనుమానస్పద మృతిగా నమోదు చేశారు. ఇదిలా ఉండగా మీనా కుమారి అత్త అన్నపూర్ణ, మామ జగ్గారావు తామే తమ కోడలను హత్య చేసినట్లు అంగీకరించారని సి ఐ ఎస్ ఆర్ ప్రసాద్ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక బయటికి వస్తే ఆమె మృతి ఆత్మహత్య కాదనే విషయం బయట పడుతుందని దాంతో వారు తమ నేరాన్ని అంగీకరించాలని చెప్పారు. మీనా కుమారి భర్త మోహన్రావు పోలాండ్ లో పనిచేసుకుంటున్నాడని, మీనా కుమారి తో అత్తమామలకు తరచూ గొడవలు జరుగుతున్నాయని , ఆ క్రమంలో వారి మధ్య గొడవ జరగగా అత్తమామలు మీనా కుమారుని హతమార్చారని చెప్పారు. మీనా కుమారి హత్యను అత్తమామలు ఆత్మహత్యగా చిత్రీకరించడంలో వారికి సహకరించిన బంధువు హేమరాజును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో పట్టణ ఎస్సై కే గోవిందరావు కూడా పాల్గొన్నారు. మీనా కుమారికి ఐదేళ్ల బాలుడు, రెండు నెలల పాప ఉన్నారు
హత్య చేసింది అత్త మామలే..
85
previous post