శ్రీశైలం మల్లన్న భక్తుల భద్రత దుఖాణాల సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మౌకిక ఆదేశాలను ఎలా పాటిస్తారని శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి దేవస్థానం అధికారులపై మండిపడ్డాడు. ఎమ్మెల్యే దేవాదాయశాఖ మంత్రి చెప్తే నిభందనలు పాటించకుండా గుడిలోనైన షాపులు కడతారా అంటూ బుడ్డా రాజశేఖరరెడ్డి ఫైరయ్యారు ఫైర్ సేప్టి లేకుండా భక్తుల భద్రత చూడకుండా ఇష్టారాజ్యంగా అధికారులు నూతన దుఖాణాలు నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఈ మద్య కాలంలో లలితాంభికా షాపింగ్ కాంప్లెక్స్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి కొన్ని దుకాణాలు తగులబడిపోయాయని ఆ సమయంలో ఫైర్ ఇంజన్ వాహనం కూడ కాంప్లెక్స్ లోకి రాలేని పరిస్థితి ఏర్పడిందని అంతటి ఇరుకు ప్రదేశంలో ద్దానిక ఎమ్మెల్యే చెప్పాడని షాపులు కట్టడం భక్తుల ప్రాణాలకు దుఖాణదారుల ప్రాణాలకు ఏదైన జరగరానిది జరిగితే ఎవరు భాద్యత వహిస్తారని అధికారులపై బుడ్డా రాజశేఖరరెడ్డి అగ్రహాం వ్యక్తం చేశారు …. ముందుగా శ్రీశైలంలోని లలితాంభికా షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న తెలుగుదేశం పార్టీ మాజి ఎమ్మెల్యే షాపుల యజమానులతో చర్చించారు. దుఖాణదారులు వారి ఇబ్బందులు వారి గోడును బుడ్డా రాజశేఖరరెడ్డికి విన్నవించుకున్నారు. ఇరుకు ప్రదేశంలో నూతనంగా దేవస్థానం అధికారులు నిర్మిస్తున్న నిర్మాణాల వద్దకు చేరుకుని వాటిని పరిశీలించారు.
నూతన దుకాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి..
105
previous post