బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అర్. కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు కేవలం బీసీలకు రెండు మంత్రి పదవులు ఇచ్చి చేతులు దులుపుకుందని… రానున్న మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యత గల ఐదు మంత్రి పదవులను కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా… బీసీ లకు ఎలాంటి న్యాయం చేయలేదని… కృష్ణయ్య బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో మండిపడ్డారు. నామిటెడ్, కార్పొరేషన్ పదవులలో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీసీ ల కులగణన చేయడంతో పాటు… పంచాయతీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోటా పెంచాలని కోరారు. అలాగే వంద గురుకుల పాఠశాలలు, 50 ఇంజినీరింగ్ కళాశాలలు, రెండు విశ్వవిద్యాలయాలు నూతనంగా ఏర్పాటు చేయాలన్నారు. పెండింగులో ఉన్న బోధన రుసుములు, ఉపకార వేతనాలు చెల్లించి… పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం కొనసాగించడంతో పాటు… కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పందని ఆర్. కృష్ణయ్య హెచ్చరించారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిపక్షాల డ్రామాలుప్రతిపక్షాలు కావాలనే కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నం మండలం, తాడికల్ గ్రామంలో గల…
- నష్టాల్లో కంగువా నిర్మాత … అండగా హీరో సూర్యదర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా, తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కంగువా. ఇది ఒక పీరియాడికల్ డ్రామా కాన్సెప్ట్ తో సరికొత్త కథతో వచ్చిన ఈ సినిమా…
- ఆర్జీవీ అరెస్ట్ కు రంగం సిద్ధం…వివాదాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ ల మారిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేస్తారా.. లేదా.. అన్న అంశం అందరిని ఆలోచింపచేస్తుంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు.. ఆయన ఇంటి వద్ద ఆర్జీవీ కోసం…
- మంత్రి వస్తేనే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రి వస్తేనే పంపిణీ చేస్తామని అధికారులు చెబుతూ లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. ఎమ్మెల్యే చెక్కులు పంపిణీ చేయడం ఆనవాయితీ కానీ మంత్రి…
- నిందితులతో కలిసి పోలీసుల చేతివాటంపోలీసులే నిందితులతో చేతులు కలిపి వారి వద్ద భారీ ఎత్తున డబ్బులు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో రెండు గేదెలను అపహరించిన కేసులో తణుకు రూరల్ పోలీసులు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.