94
ప్రకాశం జిల్లా.. మార్కాపురంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి పోస్టల్ కస్టమర్ కేర్ నుండీ ఫోన్ చేస్తున్నాము, మీరు పంపిన పోస్టల్ వెరిఫికేషన్ కోసం ఒక లింకు పంపిస్తున్నాము, అది సెలెక్ట్ చేసి మీరు రెండు రూపాయలు సెండ్ చేయమని ఒక లింక్ పంపడంతో ఉపాధ్యాయుడు లింకు ఓపెన్ చేసాడు. ఈరోజు ఒంగోలు యుటిఎఫ్ యూనియన్ మీటింగ్ కు వెళ్ళగా సెల్ ఫోన్ లో 99999 వేల రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ రావడంతో సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయానని ఉపాధ్యాయుడు గుర్తించి, మెసేజ్ రాగానే ఒంగోలు నుండి హుటాహుటిన బయలుదేరి వచ్చి సదరు ఉపాధ్యాయుడు వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్ చేరుకొని తన ఖాతా నుండి నగదు మాయమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.